ఈ హెల్తీ డ్రింక్స్ కొలెస్ట్రాల్ ను ఎంత ఫాస్ట్ గా తగ్గిస్తాయో.. !

First Published Oct 7, 2022, 4:24 PM IST

కొన్ని రకాల పానీయాలు మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటుగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కూడా వేగంగా కరిగిస్తాయి. అవేంటంటే..
 

cholesterol

ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలనే తీసుకోవాలి. లేదంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక కాలాలతో సంబంధం లేకుండా మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. ఇందుకోసం పానీయాలను ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల పానీయాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంచడంతో పాటుగా.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె పోటు, స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఎన్నో ప్రాణాంతకమైన రోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి. ఎలాంటి పానీయాలు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయో తెలుసుకుందాం పదండి.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువున్న వాళ్లు ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్  ఫుడ్ ను అసలే తినకూడదు. వీటికి బదులుగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. కొలెస్ట్రాల్ ను తగ్గించే సూపర్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

green tea

గ్రీన్ టీ

గ్రీన్ టీ  కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఎపిగాల్లో కాటెచిన్ గలేట్, కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి.  రోజుకు రెండు సార్లు గ్రీన్ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొందరగా తగ్గిపోతుంది. 
 

ఓట్స్ పాలు

ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ పాలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనిలో ఉండే బీటా గ్లూకాన్ పిత్త లవణాలతో కలిసి పేగులలో జెల్ లాంటి పొరను ఏర్పరుస్తుంది. ఇది కొలెస్ట్రాల్ శోషణను సులభతరం చేస్తుంది. 

టమాటా జ్యూస్

వేసవిలో టమాటాలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కణాలను రక్షిస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాబట్టి టమాటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగండి. 
 

సోయా పాలు

సోయా పాలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ ను తగ్గించే సమ్మేళనాలు ఉంుటాయి. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు సోయా పాలను రోజూ తాగాలని నిపుణులు చెబుతున్నారు.  

click me!