
పనిలో ఒత్తిడికి గురికావడం సర్వ సాధారణం. కానీ ఈ ఒత్తిడి అప్పటి మందం ఉంటే మరేం పర్లేదు కానీ.. ఎప్పుడూ ఉంటే మాత్రం లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉంది. చాలా మంది పనిదగ్గరే కాదు ఇంట్లో కూడా ఒత్తిడికి గురవుతుంటారు. కానీ ఈ ఒత్తిడి మన జీవితాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా దీర్థకాలిక ఒత్తిడి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందది. వీటితో పాటుగా చర్మంపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల తామర, మొటిమలు, సోరియాసిస్, జుట్టు రాలడం వంటి అనేక చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
మెదడు, చర్మం ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉంటాయి. మానసిక ఒత్తిడి చర్మంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కొత్త చర్మ సమస్యలకు దారితీస్తుంది. అప్పటికే ఉన్న సమస్యలను ఈ ఒత్తిడి మరింత తీవ్రతరం చేయొచ్చంటున్నారు నిపుణులు.
ఆందోళన, ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మీ చర్మ రంధ్రాలపై చెడు ప్రభావం చూపుతుంది. అలాగే చర్మంపై నూనె ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే సహజ నూనె రంధ్రాలను మూసివేస్తుంది. వీటివల్ల స్కిన్ పై బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోవడం ప్రారంభమవుతుంది. మొటిమలు ఏర్పడటం స్టార్ట్ అవుతుంది.
సోరియాసిస్ పెరిగే అవకాశం ఉంది
ఒత్తిడి ముఖ్యంగా సోరియాసిస్ అని పిలువబడే తాపజనక వ్యాధిని ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మ కణాలను సాధారణం కంటే 10 రెట్లు వేగంగా నయం చేస్తుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. చర్మంపై దద్దుర్లు కూడా తామరకు దారితీస్తాయి.
ఒత్తిడి వల్ల తామర పెరగడమే కాదు.. ఇది చర్మంపై మచ్చలు ఏర్పడటానికి కూడా కారణమవుతుంది. చర్మం ఎర్ర బారడం, దురద, ఎరుపు, పగుళ్లు, చర్మం గరుకు మారడానికి కూడా కారణమవుతుంది. బొబ్బలు కూడా కనిపిస్తాయి. అందుకే వీలైనంత తొందరగా ఒత్తిడిని తగ్గించుకుని ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి.
రోసేసియా
రోసేసియా అనేది ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల ఏర్పడే మరొక సాధారణ చర్మ సమస్య. మీ ముఖంలో రక్తనాళాలు ఎర్రబడటం లేదా ఎర్రబడేలా చేసే ఒక సాధారణ చర్మ సమస్య. ఇది చిన్న మొటిమలు వంటి చీముతో నిండిన గడ్డలను పుట్టిస్తుంది. ఈ లక్షణాలు వారాల నుంచి నెలల వరకు ఉంటాయి. ఇవి చాలా మంటగా అనిపిస్తాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి.
ఒత్తిడి, ఆందోళనచర్మ సమస్యలనే కాదు అన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని పరిశోధనలో తేలింది. పెరిగిన ఒత్తిడి వల్ల ముందే ఉన్న అనారోగ్య సమస్యలు మరింత పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మానసిక సమస్యలకు కూడా దారితీస్తుంది.
ఒత్తిడి వల్ల కలిగే మొటిమలను వదిలించుకోవడానికి.. సాలిసిలిక్ ఆమ్లం కలిగిన ఓవర్ ది కౌంటర్ ointments ను ఉపయోగించడం మంచిది. ఇది రంధ్రాలను మూసివేసే మృత చర్మ కణాలను తొలగిస్తుంది. మొటిమలను కూడా తగ్గిస్తుంది. మొటిమలు అయ్యే ప్రాంతాన్ని నీట్ గా శుభ్రం చేసి జిడ్డుగల చర్మాన్ని తొలగించడానికి మంచి మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించి చర్మ సమస్యలను తగ్గించడానికి చిట్కాలను తీసుకోండి.
నిద్రలేమి వల్ల చర్మం దెబ్బతింటుంది
నిద్ర లేమి చర్మ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఒత్తిడి ఎక్కువైతే సరిగ్గా నిద్రపట్టదు. ఈ నిద్రలేమి అలసట, చిరాకును పెంచుతుంది. ఇవి మీ ఒత్తిడిని మరింత పెంచుతాయి. నిద్ర లేమి వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. చర్మం ముడతలు పడుతుంది. అందుకే ఒత్తిడిని జయించడానికి ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి చేయండి.