ఏదో ఒక వంక చూసుకుని అర్ధరాత్రి నిద్రలేచి టీ తాగే వారు కూడా ఉన్నారు. చాలా మంది ఒకపూట అన్నం లేకుండానైనా ఉంటుంటారు కానీ.. టీ లేకుండా మాత్రం అస్సలు ఉండలేకపోతుంటారు. నిజానికి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు టీని పొద్దున్న ఒక్కపూటే తాగేవారు. కానీ ఇప్పుడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తున్నారు. వెదర్ కూల్ గా ఉందని, చుట్టాలు వచ్చారని, నెత్తి నొప్పి లేస్తుందని, ఒత్తిడి తగ్గించుకోవాలని.. ఇలా ప్రతి సందర్భాన్ని అవకాశంగా తీసుకుని టీలను తాగేస్తున్నారు. కొంతమందికైతే టీ తాగనిదే ఏ పనీ చేయరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీని రోజుకు ఒకసారి తాగితేనే మంచిది. అంతకు మించి తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.