తేనే కొందరికే మంచిది.. దీన్ని వీళ్లు అసలే తాగకూడదు..

First Published Aug 13, 2022, 9:49 AM IST

గాయాలను మాన్పడానికి.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి తేనెను ఉపయోగిస్తాం. తేనె గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే తేనెను కొందరు అసలే తినకూడదు. ఎందుకంటే ఇది వారి పాణాన్ని మరింత దెబ్బతీస్తుంది. 

చక్కెరతో పోల్చితే తేనెనే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల అసలు ఎలాంటి అనర్థాలు జరగవు. అందుకే డాక్టర్లు సైతం చక్కెరకు బదులుగా తేనెను తీసుకోవాలని సూచిస్తుంటారు. తేనె రుచికరంగానే కాదు.. ఆరోగ్యం పట్ల కూడా ఎన్నో ఔషదగుణాలను కలిగి ఉంటుంది. తేనెను కొన్ని రకాల గాయలను మాన్పడానికి ఉపయోగిస్తారు. అలాగే ఇది ఎన్నో అంటువ్యాధులను సైతం దూరం చేస్తుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలుంటాయి. అలాగే దీనిలో వివిధ రకాల విటమిన్లు, ముఖ్యమైన  ఖనిజాలుంటాయి. ఇవి శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి. తేనె ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణగా కూడా పనిచేస్తుంది. తేనెను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన చక్కెరలు లభిస్తాయి. తేనె అలర్జీ సమస్యను కూడా తగ్గిస్తుంది. తేనెతో ఇవే కావు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే తేనెను కొంతమంది తీసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. ఇంతకీ తేనెను ఎవరెవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఈ రోజుల్లో స్థూలకాయం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఈ స్థూలకాయం ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే స్థూలకాయులు తేనెను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక టేబుల్ స్పూన్ తేనెలో 60 కేలరీలు ఉంటాయి. ఇతర ఆహార పదార్థాలతో పాటుగా తేనెను తీసుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు తేనెను తీసుకోకపోవడమే మంచిది. 

అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఒక టీస్పూన్ తేనెను భేషుగ్గా తినొచ్చు. వారికి దీని వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

డయాబెటీస్ సమస్య ఉన్నవారు కూడా తేనెకు దూరంగానే ఉండాలి. అయితే మధుమేహులు కొంతమంది చక్కెరను తినకూదని దానికి బదులుగా తేనెను ఉపయోగిస్తుంటారు. చక్కెరలా తేనె మరీ అంత హానికరమైనదేం కాదు కానీ.. ఇది కూడా మధుమేహులు మంచిది కాదు. ఎందుకంటే తేనె కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 

వృద్ధులకు డయాబెటీస్ ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే వాళ్లకు డయాబెటీస్ ఉంటే తేనెను మొత్తమే తీసుకోవడం మానేయాలి. లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది. 

ఇంతకు  ముందు చెప్పినట్టుగా ఆరోగ్యకరమైన ఆహారంతో పాటుగా వ్యాయామం క్రమంగా చేసేవారు ఎలాంటి బయాలు పెట్టుకోకుండా తేనెను తాగొచ్చు. అది కూడా పరిమితిలోనే. .

click me!