గుత్తి క్యాప్సికం మసాలా కూర.. ఇలా ట్రై చేస్తే సూపర్ టెస్ట్!

First Published Aug 12, 2022, 1:51 PM IST

ఇంట్లో క్యాప్సికం అందుబాటులో ఉంటే క్యాప్సికం మసాలా, క్యాప్సికం రైస్ వంటి వంటలను ఎన్నో వండుకుంటాం.
 

ఇలా ఎప్పుడు చేసుకునే వంటలకు బదులుగా గుత్తి వంకాయ మాదిరిగా గుత్తి క్యాప్సికం మసాలను కూడా వండుకోవచ్చు. ఈ కూర వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా (Tastefully) బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం గుత్తి క్యాప్సికం మసాలా (Guthi Capsicum Masala) కూర తయారీ విధానం గురించి తెలుసుకుందాం.. 
 

కావలసిన పదార్థాలు: పావుకిలో క్యాప్సికం (Capsicum), ఒక ఉల్లిపాయ (Onion), రెండు టమోటాలు (Tomatoes), రెండు పచ్చిమిరపకాయలు (Green chilies), ఒక టేబుల్ స్పూన్ పల్లీలు (Peanuts), ఒక స్పూన్ నువ్వులు (Sesame seeds), ఒక స్పూన్ ధనియాలు (Coriander seeds), ఒక స్పూన్ ఎండుకొబ్బరి (Dry coconut) తురుము, కొద్దిగా చింతపండు (Tamarind).
 

ఎనిమిది వెల్లుల్లి (Garlic), రుచికి సరిపడా ఉప్పు (Salt), రెండు యాలకులు (Cardamom), నాలుగు లవంగాలు (Cloves), ఒక ఇంచు దాల్చిన చెక్క (Cinnamon), రెండు స్పూన్ ల కారం (Chilli), పావు స్పూన్ పసుపు (Turmeric), సగం స్పూన్ జీలకర్ర (Cumin), కొత్తిమీర (Coriander) తరుగు, నాలుగు టేబుల్ స్పూన్ ల నూనె (Oil).
 

తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పల్లీలను (Peanuts) వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని ఇందులోనే వెల్లుల్లి, ఉప్పు, కారం, చింతపండు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, కొత్తిమీర, టమోటాలు, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
 

ఇప్పుడు క్యాప్సికంలను తీసుకొని నీటిలో బాగా శుభ్రపరుచుకోవాలి. క్యాప్సికంపైన ఉన్న తోటిమ భాగాన్ని చాకుతో కట్ చేసుకుని అందులో ఉన్న గింజలను తీసి గ్రైండ్ చేసుకున్నా మసాలాను నింపుకోవాలి. ఇలా అన్ని క్యాప్సికంలలోనూ మసాలాను నింపి మిగిలిన మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె (Oil) వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి చిలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై (Fry) చేసుకోవాలి.
 

ఉల్లిపాయలు వేగిన తరువాత మసాలా పెట్టుకున్న క్యాప్సికంలను వేసి తక్కువ మంట (Low flame) మీద ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికం ఫ్రై అయిన తరువాత మిగిలిన మసాలా, ఒక గ్లాసు నీళ్లు (Water) పోసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. క్యాప్సికం బాగా ఉడికి కూర నుంచి నూనె పైకి తేలేవరకు ఉడికించుకొని చివరిలో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన గుత్తి క్యాప్సికం మసాలా కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

click me!