పసుపు, పాలు: ఒక కప్పులో కొద్దిగా పసుపు (Turmeric), కొన్ని పాలు (Milk) వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జిడ్డు చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మారుస్తాయి.