రోజూ 2 టీ స్పూన్ల తేనెను తీసుకుంటే ఎన్ని సమస్యలు నయమవుతాయో ఎరుకేనా?

First Published Nov 22, 2022, 4:58 PM IST

తాజా పరిశోధనల ప్రకారం.. రోజుకు రెండు టీ స్పూన్ల తేనెను తీసుకోవడం వల్ల హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం రాదు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. 
 

తేనెలో ఉండే ఔషద గుణాల గురించి చాలా మందికి తెలుసు. తేనె మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి తేనె సహాయపడుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కార్డియాక్ మెటబాలిజంతో ముడిపడి ఉందని పరిశోధకులు గుర్తించారు. కార్డియో మెటబాలిక్ డిసీజ్ గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ తో ముడిపడి ఉంటుంది.

టీలో, ఇతర ఆహారాల్లో చక్కెరకు బదులుగా తేనెను కలిపి తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, నాన్ ఆల్కహాలిక్, ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇటీవల 1,100 మందికి పైగా పాల్గొన్న వారిపై 18 రకాల పరీక్షలు నిర్వహించారు. దీనిలో కనుగొన్న విషయాలను విశ్లేషించి.. పువ్వు నుంచి బయటకు వచ్చిన తేనె శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని కనుగొన్నారు.

పువ్వు నుంచి తీసిన తేనె వల్ల కలిగే అదనపు ప్రయోజనాలున్నాయి

ఈ తేనె రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది.  మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే మంటను తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు సాధారణంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నారు. అలాగే తాము రోజూ తీసుకునే కేలరీల్లో చక్కెర 10% లేదా అంతకంటే తక్కువగానే ఉండి.  వీళ్లకు 8 వారాలపాటు ప్రతిరోజూ సగటున 40 గ్రాములు లేదా సుమారు రెండు టేబుల్ స్పూన్ల తేనెను ఇచ్చారు. పువ్వు నుంచి తయారైన తేనెను తినే వ్యక్తుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయని  గమనించారు. 
 

తేనెను ఎక్కువగా వేడి చేయకూడదు

తేనెను 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేస్దే.. దానితో ఉండే లక్షణాలు నాశనమవుతాయని పరిశోధనలో తేలింది. ఒకవేళ ఈ తేనెను తీసుకున్నా.. దాని నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందవు. "తేనె సాధారణ, అరుదైన చక్కెరలు, ప్రోటీన్లు, సేంద్రీయ ఆమ్లాలు, ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాల సంక్లిష్ట కలయిక. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి" అని విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ లో సీనియర్ పరిశోధకుడు తౌసీఫ్ ఖాన్ చెప్పారు. ఒకవేళ మీరు చక్కెరను తీసుకోకపోతే.. తేనె తీసుకోవాలని మేము చెప్పడం లేదు" అని తౌసీఫ్ చెప్పారు. 'మీరు ఏదైనా చక్కెర, సిరప్ లేదా ఇతర స్వీటెనర్ ను ఉపయోగిస్తుంటే.. వీటికి బదులుగా తేనెను తీసుకుంటే కార్డియో మెటబాలిజం ప్రమాదాన్ని తగ్గించుకున్న వారవుతారని ఆయన అన్నారు.

click me!