కలబంద జ్యూస్ ను తాగడం వల్ల ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Published : Nov 22, 2022, 04:23 PM IST

కలబందలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. చాలా కలబందను చర్మానికి, వెంట్రులకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. నిజానికి దీని రసం తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి తెలుసా..?   

PREV
16
కలబంద జ్యూస్ ను తాగడం వల్ల ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

కలబందను ఉపయోగించి జుట్టు, చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. కలబంద చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. మచ్చలను పోగొడుతుంది. అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. ఇక జుట్టుకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది. వెంట్రుకలు అందంగా తయారవుతుంది. కుదుళ్ల బలంగా మారతాయి. జుట్టు సిల్కీగా మారుతుంది. అందుకే ఈ కలబందను స్కిన్, హెయిర్ ప్రొడక్ట్స్ లో వాడుతుంటారు. ఈ కలబందను వివిధ ఆయుర్వేద వంటకాలు, టానిక్ లలో కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కలబంద రసాన్ని తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు. ఈ కలబంద మీ గట్ ఆరోగ్యానికి చాలా మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

26

పోషకాహార నిపుణులు లవ్నీత్ బాత్రా ఇటీవల కలబంద రసం తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో తెలియజేశారు. కలబందను ప్రీబయోటిక్ గా ఉపయోగించవచ్చు ఎందుకంటే గట్ లో  మంచి బ్యాక్టీరియాను ఉంచడానికి. దీనిలో ఎసిమానైన్, గ్లూకోమానెన్, అక్సెమనోస్, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ సి లు ఉంటాయి. ఇవి గట్ ను రక్షించడంలో సహాయపడతాయి.
 

36

కలబంద పెద్దప్రేగులో సంకోచాలను ప్రేరేపిస్తుంది. అలాగే పేగు ఆర్ద్రీకరణను తగ్గిస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు కూడా ఉంటాయి. రోజూ ఎదుర్కొనే ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ జ్యూస్ శరీరంలో ఉండే విషాన్ని వ్యర్థపదార్థాలను బయలకు పంపుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. 

46

ఈ కలబంద జ్యూస్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అవును బాడీ హైడ్రేట్ గా ఉంటేనే పోషకాలు ఆహారం నుంచి బాగా గ్రహించబడతాయి. తద్వారా అవాంఛిత ఆహార కోరికలు నియంత్రించబడతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కలబంద శరీరంలో మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

56

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫైటోథెరపీ అండ్ ఫైటోఫార్మాసీ ప్రకారం.. రోజుకు రెండు టేబుల్ స్పూన్ల కలబంద రసం తీసుకోవడం టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంటే ఇది షుగర్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

66
aloe vera juice

కలబంద జ్యూస్ ఎలా తయారు చేయాలి

ముందుగా.. తాజా కలబంద కొమ్మను తీసుకోండి. దీని నుంచి లోపలుండే జెల్ ను మాత్రమే తీయండి. ఎందుకంటే దీని చర్మం చేదుగా ఉంటుంది. ఆ తర్వాత ఈ జెల్ కు రెండు ముక్కలు అల్లం, అర టీస్పూన్ నిమ్మరసం, కొన్ని నీరు కలిపి మిక్సీలో వేయండి. దీన్ని వడబోసి కొంచెం తేనె లేదా పంచదార వేసి తాగండి.
 

Read more Photos on
click me!

Recommended Stories