పిస్తా పప్పులు
ఫైబర్ అధికంగా ఉండే పిస్తాపప్పులు బరువు తగ్గాలనుకునే వారు తినగలిగే ఉత్తమ గింజల్లో ఒకటి. పిస్తాల్లో కాల్షియం, ఐరన్, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు కూడా ఇందులో ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పిస్తాపప్పులు కూడా జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల పిస్తాలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పిస్తాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినొచ్చు.