కొలెస్ట్రాల్ ఎక్కువున్న వాళ్లు పల్లీలను తినొద్దా?

First Published Dec 20, 2022, 3:42 PM IST

నిజానికి వేరుశెనగలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఏ మాత్రం పెంచవు. రోజూ గుప్పెడు పల్లీలను తింటే గుండె ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు. 
 

అధిక కొలెస్ట్రాల్  అనేది రోగం కాదు. కానీ ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీసే ప్రధాన కారకం. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు పల్లీలను తినడానికి వెనకాడుతుంటారు. ఎక్కడ అది కొలెస్ట్రాల్ ఇంకింత పెంచుతుందోనని. నిజానికి పల్లీలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయినప్పటికీ మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువుండి పల్లీలను తినాలనుకుంటే మాత్రం ఒక సారి డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 
 

వేరుశెనగలను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ఆ వంటల టేస్ట్ యే మారుతుంది. వీటిని చవకైన బాదం అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే వేరు శెనగల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో మోనో-అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పల్లీలు కొలెస్ట్రాల్ ను పెంచుతాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు పల్లీలు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. వేరు శెనగలను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనడం పూర్తిగా అబద్దమేనంటున్నారు నిపుణులు. వేరుశెనగలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయే తప్ప పెంచవు. 

Peanuts

వేరు శెనగ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా తగ్గిస్తుంది? 

వాస్తవానికి వేరుశెనగ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని ఎంతమాత్రం పెంచదు. వాస్తవానికి రోజూ గుప్పెడు పల్లీలను తినడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి హార్ట్ హెల్త్ కు చాలా మంచివి. వేరుశెనగలో కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయని అనుకుంటారు. కాని అది నిజం కాదంటున్నారు నిపుణులు. పల్లీలు బరువును నియంత్రించడంలో కూడా ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే వీటిని తిన్న తర్వాత మీ కడుపు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినకుండా ఉంటారు. వేరుశెనగల్లో  విటమిన్ ఇ, రాగి, మాంగనీస్ తో సహా ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

కొలెస్ట్రాల్ స్థాయిలను ఎక్కువగా ఉన్న వాళ్లకే కాదు.. డయాబెటిక్ పేషెంట్లకు కూడా వేరు శెనగలు ఎంతో మేలు చేస్తాయి. మధుమేహంతో బాధపడేవారు వారానికి కనీసం ఐదు సార్లు వేరుశెనగలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. వేరుశెనగలను రోజూ తినే వారు గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ గింజలు రక్తపోటును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

వేరుశెనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

వేరుశెనగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

వేరుశెనగలు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వేరుశెనగ కొలెస్ట్రాల్ నిర్వహణలో సహాయపడుతుంది.

రక్తపోటును నియంత్రించడానికి కూడా ఈ గింజలు సహాయపడతాయి. 

వేరుశెనగలు వాపును తగ్గిస్తాయి.

వేరుశెనగలు కూడా బరువును అదుపులో ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి. 

click me!