ఈ ఆహారాలు మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు.. వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి తెలుసా?

First Published Dec 20, 2022, 2:01 PM IST

కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల  ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా.. మీ జీవక్రియ, జీర్ణక్రియను పెంచడానికి కూడా సహాయపడతాయి. దీంతో మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 
 

ఈ సీజన్ లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. ఇంకేముంది వేడి వేడి ఆహారాలనే ఎక్కువగా తినాలనిపిస్తుంది. అందులోనూ వాతావరణంలో మార్పులు మన రోగనిరోధక శక్తిని బాగా తగ్గిస్తాయి. దీనివల్ల చాలా మంది ఫ్లూ, దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు. అయితే ప్రతి వంటింట్లో ఉండే కొన్ని ఆహారాలు మనకు రెండు విధాలుగా మేలు చేస్తాయి. 

ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీవక్రియను, జీర్ణక్రియను పెంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గేందుకు సహాయపడే వంటిటి ఆహార పదార్థాలేంటో  ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Image: Getty Images

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిని ఆయుర్వేదంలో క్రిమిసంహారక ఔషదంగా ఉపయోగిస్తారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.  ఈ మసాలా దినుసు బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ తియ్యని మసాలా జీవక్రియను పెంచుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో చెడ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దాల్చినచెక్క కలిపిన నీటిని ఉదయాన్నే తాగడం వల్ల ఆకలి కోరికలు తగ్గుతాయి. దీంతో మీరు వేగంగా బరువు తగ్గుతారు. 
 

black pepper

మిరియాలు

ఆయుర్వేదం ప్రకారం.. నల్ల మిరియాలు బరువు తగ్గడానికి సమర్థవంతమైన పనిచేస్తాయి. ఇది శరీరంలో అడ్డంకులను తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇవి కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి.
 

అల్లం

ఆయుర్వేదం ప్రకారం.. ఈ మ్యాజిక్ మసాలా జీవక్రియను 20 శాతం పెంచుతుంది. అలాగే గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో విషాన్ని బయటకు పంపుతుంది. దీనిలో ఉండే  యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. అల్లం కూడా ఆకలి కోరికలను తగ్గిస్తుంది. అల్లాన్ని ప్రతిరోజూ తీసుకుంటే మీరు సులువుగా బరువు తగ్గడమే కాదు మొత్తం ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

నిమ్మ

నిమ్మకాయల్లో విటమిన్ సి, కరిగే ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. నిమ్మకాయలు గుండె జబ్బులు, రక్తహీనత, మూత్రపిండాల్లో రాళ్ళు, జీర్ణ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాల్ని తగ్గిస్తాయి.మీరు తినే ఆహారంలో నిమ్మకాయను చేర్చడం, సలాడ్లపై చల్లడం లేదా నిమ్మరసం తయారు చేసుకుని తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గడమే కాదు వేగంగా బరువు కూడా తగ్గుతారు. 

తేనె

రాత్రి నిద్రపోయే ముందు తేనె తీసుకోవడం వల్ల కేలరీలను ఎక్కువగా బర్న్ చేస్తారు. తేనెలోని ముఖ్యమైన పోషకాలు ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి చాలా సులభమైన మార్గంలో తేనె ఎంతో సహాయపడుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే  గుండె జబ్బులు, డయాబెటిస్,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

click me!