విటమిన్ ఎ, విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే జుట్టు రాలడం ఆగుతుంది. జుట్టు పొడిబారడం, తెగిపోవడం సమస్యే ఉండదు. అంతేకాదు ఇవి మీ జుట్టును వేగంగా పెంచుతాయి కూడా.
ఒత్తైన, పొడవైన, నల్లని జుట్టును కోరుకోని వారు ఎవరూ ఉండరు. కానీ నేడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో హెయిర్ ఫాల్ ఒకటి. హెయిర్ ఫాల్ కు కారణాలెన్నో ఉన్నాయి. అందులో విటమిన్ల లోపం కూడా ఒకటి. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు విటమిన్లు అవసరమవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టు బలం తగ్గిపోవడానికి విటమిన్ల లోపం ప్రధాన కారణం. అందుకే జుట్టు బలంగా ఉండేందుకు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి.
27
విటమిన్ ఎ, విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని తింటే మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. విటమిన్ ఎ, విటమిన్ బి లు జుట్టు రాలడాన్ని ఆపుతాయి. అలాగే జుట్టు పొడిబారడం, తెగిపోవడాన్ని నివారించడానికి సహాయపడతాయి. అందుకే ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తినండి. ఈ విటమిన్లు ఏయే ఆహారాల్లో ఉంటాయంటే..
37
క్యారెట్లు
క్యారెట్లు విటమిన్ ఎ కు మంచి వనరు. దీనిలో విటమిన్ ఎ తో పాటుగా బీటా కెరోటిన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుతుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా ఆగుతుంది. ఈ క్యారెట్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడతాయి.
47
గుడ్లు
గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. గుడ్లలోప్రోటీన్ చాలా చాలా ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్ అవసరం. గుడ్లలో కూడా బయోటిన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడే ఒక గొప్ప పదార్ధం. జుట్టు బాగా పెరగాలన్నా.. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా రోజూ మిస్ కాకుండా ఒక గుడ్డును తినండి.
57
ఆకు కూరలు
ఆకు కూరలు కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. పోషకాలతో సమృద్ధిగా ఉండే ఆకుకూరలు జుట్టు రాలడాన్ని నివారించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు వీటిని రోజూ తింటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఆకు కూరలలో బచ్చలికూర చాలా ముఖ్యమైనది. బచ్చలికూర విటమిన్ల కు మంచి మూలం. దీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.
67
Image Credit: Getty Images
చేపలు
చేపలల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో పాటు విటమిన్ బి 3, విటమిన్ బి 6, విటమిన్ బి 12 కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడతాయి. అలాగే జుట్టు ఊడిపోకుండా చూస్తాయి.
77
అవొకాడో
అవోకాడోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ అవోకాడోలో విటమిన్ ఎ, విటమిన్ బి 2, విటమిన్ బి 3 లు పుష్కలంగా ఉన్నాయి. అవోకాడోలో సహజ నూనెలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో బయోటిన్ కూడా ఉంటుంది. ఇవన్నీ జుట్టు బాగా పెరిగేందుకు, రాలిపోకుండా కాపాడేందుకు సహాయపడతాయి.