చలికాలంలో బాడీ హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తాగండి..

Published : Jan 06, 2023, 10:47 AM IST

చలికాలమని చాలా మంది నీళ్లను అసలే తాగరు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మీకు తెలుసా.. డీహైడ్రేషన్ వల్ల  ఆరోగ్యం పాడవడమే కాదు.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. అందుకే..   

PREV
16
చలికాలంలో బాడీ హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తాగండి..

శీతాకాలంలో నిర్జలీకరణం సర్వ సాధారణ సమస్య. ఈ నిర్జలీకరణానికి ప్రధాన కారణం నీళ్లను సరిగ్గా తాగకపోవడం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ డీహైడ్రేషన్ డ్రై స్కిన్ తో పాటుగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నిజానికి చలికాలంలో దాహం తక్కువగా అవుతుంది. దీనికి తోడు చల్లని వాతావరణంలో నీటిని తాగడానికి ఇష్టపడరు. నిజానికి కాలాలతో సంబంధం లేకుండా నీటిని తాగాల్సి ఉంటుంది. రోజంతా తగినంత ద్రవాలను తాగితేనే మీరు ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంటారు. అలా అని కృత్రిమంగా తియ్యటి పానీయాలు,ఆల్కహాల్ ను తాగకూడదు. ఇవి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ సీజన్ లో శరీరం హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పానీయాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

హెర్బల్ టీ

నిర్జలీకరణాన్ని ఎదుర్కోవటానికి హెర్బల్ టీ లు మంచి మార్గం.  ఎందుకంటే వీటిలో కెఫిన్ కంటెంట్ ఉండదు.  ఈ హెర్బల్ టీ లలో ఒకటి అయిన చామంతి టీ ని మీరు ఎంచక్కా తాగొచ్చు. ఇది చామంతి పువ్వు నుంచి తయారవుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసే సేంద్రీయ టీ ఇది. ఈ టీ కండరాల తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాత్రిళ్లు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఆందోళనను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే  పీరియడ్స్ తిమ్మిరిని తగ్గిస్తుంది. 

36

పసుపు పాలు

పసుపు పాలను ఎక్కువగా రాత్రిళ్లు తాగుతుంటారు. ఈ పాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. నైట్ టైం పసుపు పాలను తాగడం వల్ల ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా నిద్రపోతారు. పసుపు పాలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపు పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలు మీ శరీరాన్ని నేరుగా హైడ్రేట్ చేయలేనప్పటికీ.. మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. 
 

46

ఆకుపచ్చ రసం

రకరకాల కూరగాయలు, ఆకుకూరల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఆకుపచ్చని రసాల ద్వారా మన శరీరానికి నీరు, ఎలక్ట్రోలైట్లు, ఫైబర్ లు అందుతాయి. ఆకుపచ్చ రసాలు మీ ఆరోగ్యాన్నిమెరుగుపర్చడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇది ఆర్ద్రీకరణ స్థాయిలను కూడా పెంచుతుంది. చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
 

56

అల్లం రసం

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అల్లంలో రక్తపోటు, బరువు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే లక్షణాలు ఉంటాయి. అంతేకాదు అల్లం క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం నీటిని లేదా అల్లం టీ ని తాగడం వల్ల మీ ఆర్ద్రీకరణ స్థాయి పెరుగుతుంది. అంతేకాదు ఇది చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉండటానికి, శరీర నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

66

వేడి సూప్ లు

చలికాలంలో వేడి వేడి సూప్ లను తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కూరగాయలను నీటిలో ఉడకబెట్టడం ద్వారా వీటిని సులభంగా తయారు చేయొచ్చు. బంగాళాదుంపలు, క్యారెట్లు, టర్నిప్స్, బఠానీలు, టమోటాలు, ఇతర కూరగాయలతో..  మీరు మిశ్రమ కూరగాయల సూప్ తయారు చేయొచ్చు. హైడ్రేటెడ్ గా ఉండటానికి మీరు బచ్చలికూర సూప్ ను కూడా తయారు చేసుకుని తీసుకోవచ్చు.  మీ సూప్ లో పుట్టగొడుగులను కూడా జోడించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను పెంచుతాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories