కళ్ల చుట్టూ వాపు వచ్చిందా? రెండు చుక్కల బాదం నూనెతో ఇలా చేస్తే చిటికెలో వాపు తగ్గిపోతుంది..

First Published Jan 5, 2023, 4:56 PM IST

కళ్ల చుట్టూ వాపు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే చాలా మందికి వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటారు. కేవలం రెండు చుక్కల బాదం నూనెతో వాపును చిటికెలో తగ్గించుకోవచ్చు. అదెలాగంటే.. 
 

చాలా మందికి ఉదయం లేచిన వెంటనే కళ్లు బాగా ఉబ్బిపోయి ఉంటాయి. అయితే ఈ వాపు గురించి కొంతమంది అస్సలు పట్టించుకోరు. వాటంతట అవే తగ్గిపోతుంటాయని పట్టించుకోవడం మానేస్తుంటారు.  కానీ కళ్ల చుట్టూ వాపుతో బయటకు వెల్లడం ఇబ్బందిగానే ఉంటుంది. అంతేకాదు ఇది మీ మానసిక స్థితిని కూడా దిగజార్చుతుంది. కంటిచుట్టూ ఉన్నవాపును దాచేయాలని మీరు ఎంత మేకప్ వేసినా ఫలితం మాత్రం అస్సలు ఉండదు. అందులోనూ వాపు ఉన్నప్పుడు మేకప్ వేస్తే మీరు మరింత అందవిహీనంగా కనిపిస్తారు. అయితే ఈ వాపును తగ్గించుకోవడానికి మార్కెట్ లో అండర్ ఐ మాస్క్ లు సహాయపడతాయి. అంత సమయం లేనివారు ఇంట్లోనే కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు. 

కళ్ల చుట్టూ వాపును తగ్గించడానికి బాదం నూనె బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదం  నూనెలో ఎన్నో ఔషద లక్షణాలుంటాయి. ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల వాపు తొందరగా తగ్గిపోతుంది. బాదం నూనెలో పుష్కలంగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. ఈ నూనెతో కళ్ల కింద మసాజ్ చేస్తే వాపు ఇట్టే తగ్గిపోతుంది. అలాగే కంటి మంట కూడా తగ్గుతుంది. ఇందుకోసం బాదం నూనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

puffy eyes


కళ్ల చుట్టు వాపు ఎందుకొస్తుంది? 

కళ్ల కింద ద్రవం పేరుకుపోవడం వల్ల కంటి కింద వాపు వస్తుంది. అలాగే శరీరానికి సరిపడా నీటిని తాగకపోతే.. బాడీ డీహైడ్రేషన్ కు గురవ్వడం వల్ల కూడా కంటి చుట్టూ వాపు వస్తుంది. వీటితో పాటుగా స్మోకింగ్ చేసే వారికి  కూడా కంటిచుట్టు వాపు వస్తుంది. అలాగే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల కళ్ల చుట్టూ బాగా ఉబ్బుతుంది. అలాగే కంటికి సరిపడా నిద్రపోకపోతే.. విపరీతమైన అలసట కలుగుతుంది. దీనివల్ల కూడా కంటిచుట్టూ వాపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటుగా పెద్దవయసు వారిలో కళ్ల కింద వాపు రావడం చాలా సాధారణం. సీజన్ మారడం, అలెర్జీల వల్ల కూడా కంటిచుట్టూ వాపు వస్తుంది. 
 

వాపును తగ్గించడానికి బాదం నూనెను ఎలా ఉపయోగించాలి? 

ముందుగా మీ వేళ్లకు కొద్దిగా నూనెను అద్దుకోండి. ఆ తర్వాత వేళ్లతో మీ రెండు కళ్ల చుట్టూ బాదం నూనెను అప్లై చేయండి. ఆ తర్వాత వేళ్లతో కళ్ల చుట్టూ నెమ్మదిగా కొద్దిసేపు మసాజ్ చేయండి. దీనివల్ల మీ కంటి చుట్టూ రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో వాపు తొందరగా తగ్గిపోతుంది. వారినికి రెండు సార్లు బాదం నూనెను కళ్ల చుట్టూ అప్లై చేసి మసాజ్ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. 

click me!