డయాబెటిస్ పేషెంట్లు ఎండుద్రాక్షలు తినవచ్చా?
హెల్త్ లైన్ ప్రకారం.. షుగర్ పేషెంట్లు ఎండుద్రాక్షను మితంగా తిన్నంత కాలం ఎలాంటి సమస్యలు రావు. ఎండుద్రాక్ష అన్ని రకాల పండ్ల మాదిరిగా సహజ చక్కెరను, కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అందుకే వీటిని కూడా కొద్ది మొత్తంలోనే తినాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కిస్ మిస్ లో సహజ చక్కెరతో పాటుగా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే ఎండుద్రాక్షలను ఎంచక్కా తినండి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకూడదంటే మితంగాననే తినాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.