ఆరోగ్యంగా ఉండాలంటే.. ఖరీదైన వాటినే తినక్కర్లే.. తక్కువ ధరకే దొరికే ఈ ఆహారాలను తిన్నా సరిపోతుంది..

First Published Sep 15, 2022, 11:51 AM IST

ఆరోగ్యంగా ఉండాలంటే జేబుకు చిల్లులు పడాల్సిందే అంటుంటారు కొందరు. నిజానికి ఖరీదులో ఉండే ఆహారాలను తినకున్నా ఆరోగ్యంగా ఉంటారు. 
 

healthy food

ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పకుండా తినాలి. మరి ఈ పోషకాలు ఖరీదైన ఆహార పదార్థాల్లోనే ఉంటాయని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి ఖరీదైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామనేది ఉత్తి భ్రమే. మన బడ్జెట్ కు అందుబాటులో ఉంటూ.. పోషకాలు ఎందులో ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందాం పదండి. 

సజ్జలు

సజ్జలను మన దేశంలో విరివిగా ఉపయోగిస్తారు. వీటికి పేదవాడి ఆహారం అనికూడా పేరుంది. వీటిలో ప్రోటీన్లు, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, కరిగే, కరగని డైటరీ ఫైబర్, ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

banana

అరటిపండ్లు

అరటిపండ్లు ఏ సీజన్ లో అయినా అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు చాలా తక్కువ ధరకే లభిస్తాయి కూడా. ఈ పండ్లు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో మంచివి. వీటిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, మాంగనీస్, నియాసిన్, విటమిన్ బి6, రిబోఫ్లేవిన్ తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటి పండ్లను తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఈ పండు బరువు తగ్గేందుకే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. 

చిక్పీస్

సీఫుడ్, పౌల్ట్రీ, మాంసానికి ప్రత్యమ్నాయమే చిక్పీస్ లు. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.  వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చిక్పీస్ లను తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఎన్నో జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 

బచ్చలి కూర

ఆకు కూరల్లో బచ్చలి కూర మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో మిగతా వాటికంటే ఎక్కువ పోషకాలుంటాయి. అందుకే వీటిని సూప్, సలాడ్, స్మూతీల్లో కలుపుతుంటారు. అయినా మార్కెట్ లో ఈ ఆకు కూర పుష్కలంగా లభిస్తుంది. బచ్చలికూరలో విటమిన్ కె ఎక్కువ మొత్తంలో ఉంచుతుందది. ఇది ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతుంది. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. 
 

పెసర పప్పు

పెసర పప్పుల్లో ఫైబర్ తో పాటుగా ప్రోటీన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పప్పు కండరాలను మరమ్మత్తు చేయడానికే కాదు.. నిర్మాణానికి కూడా సహాయపడుతుంది. ఈ పప్పును తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. శాఖాహారులకు ఈ పప్పు గొప్ప ఎంపిక అనే చెప్పాలి. 
 

click me!