పడకగదిలో రెచ్చిపోవడానికి వంటగది బాగా ఉపయోగపడుతుంది.. ఎలాగంటే..?

First Published | Sep 15, 2022, 9:51 AM IST

వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే సెక్స్ లైఫ్ బాగుండాలి. అయితే ఈ సెక్స్ లైఫ్ కు వంటగది బాగా ఉపయోగపడుతుంది.. ఎలాగో తెలుసా..? 

సెక్స్ శారీరక సుఖం ఇవ్వడమే కాదు.. మానసిక, శరీరక అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతుంది. అంతకు మించి భాగస్వాముల మధ్య ప్రేమను మరింత పెంచుతుంది. అందుకే భార్య భర్తల మధ్యన కనీసం వారానికి ఒకసారైనా సెక్స్ జరగాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొంతమందికి సెక్స్ పట్ల కోరికలు తగ్గిపోతుంటాయి. దీంతో భార్యభర్తల మధ్యన ప్రేమ కరువవుతుంది. అయితే వంటగదిలో ఉండే కొన్ని ఆహార పదార్థాలు లిబిడోను ఉత్తేజర్చడానికి ఎంతో సహాయపడతాయి. లిబిడో అనేది..  వ్యక్తుల లైంగిక కోరకను పెంచుతుంది. దీన్ని పెంచే ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం పదండి. 

నూనె

కొన్ని రకాల నూనెలు కూడా లైంగిక కోరికలు బాగా పెంచుతాయి. ఆలివ్ ఆయిల్, బాదం నూనెలను తీసుకుంటే సంతానోత్పత్తి బాగా పెరుగుతుంది. ఆకుపచ్చని ఆలివ్ లు పురుషుల్లో, నలుపు రంగు ఆలివ్ లు మహిళల సెక్స్ డ్రైవ్ ను పెంచుతాయి. 
 


ఉల్లిపొర

ఉల్లిపాయలు కూడా మీ లైంగిక జీవితాన్ని ఆనందంగా మార్చగలవు. ఇందుకోసం తెల్లని ఉల్లి పొరను పీల్ చేసి.. దాన్ని చూర్ణం చేసి స్వచ్ఛమైన వెన్నలో వేయించండి. దీన్ని రోజూ చెంచా తేనెతో కలిపి పరిగడుపున తినండి. ఇది మీ లైంగిక జీవితాన్ని సుఖంగా మారుస్తుంది. 
 

సిట్రిస్ ఫ్రూట్స్

నారింజ, నిమ్మకాయల్లో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి లైంగిక అవయవాలను రక్షించడమే కాదు.. అవి సజావుగా పనిచేయడానికి కూడా  సహాయపడతాయి. ఇవి  భావప్రాప్తిని పెంచడానికి కూడా తోడ్పడతాయి. 
 

banana

అరటి పండ్లు

పడకగదిలో చురుగ్గా ఉండేందుకు అరటిపండ్లు ఎంతో సహాయపడతాయి. ఈ అరటిపండ్లలో బ్రోమెలైన్ ఉంటుంది. ఇవి పురుషుల్లో లిబిడోను  ఉత్తేజపరుస్తాయని నమ్ముతారు. అరటిలో ఉండే విటమిన్ బి, పొటాషియంలు టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచుతాయి. 
 

nuts

నట్స్

నట్స్ లైంగిక జీవితానికి ఎంతో అవసరపడతాయి. వీటిలో పుష్కలంగా ఉండే జింక్ మహిళల్లో లిబిడో కు సహాయపడతాయి.అలాగే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. అలాగే ఇది సెక్స్ హార్మోన్లు బాగా రిలీజ్ అయ్యేందుకు కూడా సహాయపడతాయి. నట్స్ లైంగిక ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. 
 

బీన్స్

సోయా బీన్ ఉత్పత్తులు సెక్స్ లైఫ్ కు ఎంతో సహాయపడతాయి. వీటిలో స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజెన్ ను పోలిన రసాయనాలు ఉంటాయి. ఇవి కణితి పెరగుదలను నివారిస్తాయి. దీంతో ప్రోస్టేట్, ఇతర క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. 
 

dates

ఖర్జూరాలు

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి పురుషుల సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతో సహాయపడాయి. వీటిలో లిబిడోను పెంచే సామర్థ్యం ఉంటుంది. ఇందుకోసం ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తినండి. వీటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది ఆడవారిలో అండోత్సర్గము ప్రక్రియన బలోపేతం చేస్తుంది. 

Latest Videos

click me!