చలికాలం ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఈ సీజన్ లోనే ఎన్నో రోగాలు పట్టిపీడిస్తుంటాయి. దగ్గు, గొంతు నొప్పి, జలుబు, సీజనల్ ఫ్లూ తో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది చలికాలం. దగ్గు, గొంతునొప్పికి కూడా మాత్రలు వేసుకునే వారున్నారు. కానీ ఈ సీజన్ లో ఈ సమస్యలు తరచుగా వస్తుంటాయి. అలా అని తరచుగా మాత్రలను వేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులతో ఈ సమస్యను చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. అదికూడా చిన్నగా ఉండే లవంగంతో. లవంగాలు సహజంగా దగ్గుతో పోరాడటానికి సహాయపడటమే కాకుండా మన రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. లవంగాలు యూజెనాల్, గాలిక్ ఆమ్లం వంటి ఫినోలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న లవంగాలు సీజనల్ ఫ్లూ నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా నిరంతర దగ్గు వల్ల కలిగే నొప్పిని కూడా తగ్గిస్తాయి. లవంగాల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..