వెల్లుల్లి బీపీని తగ్గిస్తుంది.. కానీ తినే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి

First Published Jan 28, 2023, 4:57 PM IST

వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి12 రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇదేకాకుండా వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. దీని వల్ల నైట్రిక్ ఆక్సైడ్ (ఎన్ఓ), హైడ్రోజన్ సల్ఫైడ్ (హెచ్ 2 ఎస్) వాయువులు ఏర్పడతాయి.
 

బీపీ రోగుల రక్త పోటును తగ్గించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ప్రీబయోటిక్ లక్షణాలు గట్ సూక్ష్మజీవుల సమృద్ధిని పెంచుతాయి. వెల్లుల్లి సారం రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. హై బిపి సమస్యను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే వెల్లుల్లిని అధిక రక్తపోటు పేషెంట్లు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.
 

garlic


హైబీపీలో వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు

రక్తపోటును నియంత్రిస్తుంది

వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి12 రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాదు వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది, దీని వల్ల నైట్రిక్ ఆక్సైడ్ (ఎన్ఓ), హైడ్రోజన్ సల్ఫైడ్ (హెచ్ 2 ఎస్) వాయువులు ఏర్పడతాయి. ఈ సమ్మేళనాలు మన రక్త నాళాలను సడలించి వాటిని విడదీయడానికి సహాయపడతాయి. ఈ విధంగా రక్తనాళాల్లో తగినంత స్థలం ఉన్నప్పుడు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.ఈ విధంగా వెల్లుల్లి హైబీపీని అదుపులో ఉంచుతుంది. 
 


రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది

మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే.. ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అవసరమైనప్పుడు అనారోగ్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కూడా రోగనిరోధక వ్యవస్థ సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వైరస్ ను నివారించడానికి వెల్లుల్లి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మీకు తెలుసా పిల్లలకు ఏడాదికి ఏడెనిమిది సార్లు జలుబు చేస్తుంది. పెద్దలకైతే రెండు నుంచి నాలుగు సార్లు జలుబు చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో పచ్చి వెల్లుల్లిని తింటే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. రోజుకు రెండు తరిగిన వెల్లుల్లి రెబ్బలు తిన్నా ఆరోగ్యం బాగుంటుంది. 


 కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది

కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కొవ్వు పదార్థం. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి "చెడు" ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, రెండు "మంచి" హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా అయితే ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అయితే వెల్లుల్లి మొత్తం కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ స్థాయిలను 10 నుంచి 15 శాతం తగ్గిస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. వెల్లుల్లి మీ హెచ్డిఎల్ లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను ఏ మాత్రం ప్రభావితం చేయదు. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నా..  లేదా గుండె జబ్బులతో బాధపడుతున్నా.. వెల్లుల్లిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. 
 


వెల్లుల్లి క్యాన్సర్ నివారణకు సహాయపడుతుంది

వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరిశోధన ప్రకారం.. తాజా వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని తేలింది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఇతర కూరగాయలు, పండ్లతో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినే మహిళలకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం 35% తక్కువగా ఉంటుందని వెల్లడించాయి. 
 

వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి

వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. అల్లిసిన్ అనేది బయోయాక్టివ్ యాంటీ బయాటిక్.  ఇవి అంటువ్యాధులు, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లి సారాలు బ్యాక్టీరియా పెరుగుదలను ఆపేస్తాయని తేలింది

శిలీంధ్ర మూలకాలు
ప్రోటోజోవా మూలకాలు
వైరల్ ఇన్ఫెక్షన్లు
అనేక బ్యాక్టీరియా, సాల్మొనెల్లా

వెల్లుల్లి అల్జీమర్స్, చిత్తవైకల్యాన్ని నివారిస్తుంది

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో ఏదైనా ఆక్సీకరణ నష్టం జరగకుండా నిరోధించడానికి సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి కొన్ని అభిజ్ఞా వ్యాధులను నివారించడానికి కూడా సహాయపడతాయి. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు కొంతవరకు మాత్రమే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 

వెల్లుల్లిని ఎలా తినాలి

1. ప్రతిరోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తినండి

హైబీపీ రోగులు 2 వెల్లుల్లి రెబ్బలను తినొచ్చు. అయితే దీనిని ఉదయం లేదా పగటిపూట ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనివల్ల ఉదయం నుంచి శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. వీటివల్ల రక్తనాళాలపై ఒత్తిడి పడకుండా.. గుండె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు నిపుణులు. 

వెల్లుల్లిని వేయించి తినండి

వేయించిన వెల్లుల్లి లను తింటే కూడా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందుకోసం వెల్లుల్లిని బాణలిలో వేయించి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో కలిపి తాగండి. ఈ విధంగా వెల్లుల్లి తీసుకోవడం వల్ల హైబీపీ పేషెంట్లకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఒక రోజులో ఎక్కువ తినకుండా జాగ్రత్త పడండి. 

అలాగే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బరువు సులువుగా తగ్గుతారని చాలా మంది నమ్ముతారు. ఇది అదనపు కిలోలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  అంతేకాదు పచ్చి వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా.
 

click me!