ముల్లంగిని తీసుకుని దాని ఆకులను పారేస్తున్నారా? మీరెన్ని లాభాలను మిస్ అవుతున్నారో తెలుసా?

First Published Jan 28, 2023, 3:02 PM IST

చలికాలంలో ముల్లంగిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ముల్లంగితో పాటుగా దాని ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

చలికాలంలో ముల్లంగి, బీట్ రూట్, క్యారెట్ వంటి రూట్ వెజిటేబుల్స్ ను ఖచ్చితంగా తినాలంటారు  ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. వీటన్నింటి కంటే ముల్లంగినే ఎక్కువగా తింటుంటారు. అయితే ముల్లంగిని తీసుకుని దాని ఆకులను పారేస్తుంటారు. కానీ ముల్లంగి కంటే దాని ఆకులే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 
 

ముల్లంగి ఆకుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముల్లంగి ఆకుల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ కె లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. 

ముల్లంగి ఆకులను అనేక విధాలుగా ఉపయోగించొచ్చు. దీనిని మెంతికూర, పాలకూర వంటి ఆకు కూరల్లో కలిపి వండొచ్చు. కావాలనుకుంటే ఆవపిండి ఆకుకూరల్లో కూడా వాడొచ్చు. లేదా ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయాన్నే తాగొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ రసానికి రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడిని, నిమ్మరసాన్ని కలిపి తాగొచ్చు. 
 

అంతేకాదు ముల్లంగి ఆకుల్లో ఎరుకామైడ్ అనే మూలకం ఉంటుంది, ఈ ఆకులను తినడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి వ్యాధులతో బాధపడేవారు దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి.  ఇది మెమోరీ పవర్ ను మెరుగుపరుస్తుంది.

ముల్లంగి ఆకుల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే ఉదర సమస్యలు రావు. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
 

ముల్లంగి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తాయని ఎన్నో పరిశోధనల్లో రుజువైంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుంచి ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షిస్తాయి.

ముల్లంగి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఆకులు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులను నివారించడమే కాకుండా క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

ముల్లంగి ఆకుల్లో కనిపించే ఆంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరం నుంచి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ కు కారణమయ్యే  ఫ్రీరాడికల్స్ ను ఆంథోసైనిన్ నాశనం చేస్తుంది.
 

click me!