అత్తిపండ్లు మలబద్దకం, కీళ్ల నొప్పులతో పాటుగా ఎన్నో రోగాలను తగ్గిస్తాయి.. వీటిని ఎలా తినాలంటే?

First Published Jan 28, 2023, 3:54 PM IST

అత్తిపండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మలబద్దకం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. దీని ప్రయోజనాలను పొందాలంటే వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అత్తిపండ్లను ఇంగ్లీష్ లో ఫిగ్ అంటారు. అంజీర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే లేదా డ్రై ఫ్రూట్స్ గా కూడా తీసుకోవచ్చు. పోషకాలు పుష్కలంగా ఉండే అంజీర పండ్లు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మధుమేహం, గుండె సమస్యలు, మలబద్ధకంతో సహా కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. అత్తి పండ్లను ఎలా తింటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూడు అత్తి పండ్లను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. వాస్తవానికి అత్తి పండ్లలో లాగ్జివ్ లక్షణాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో డైటరీ ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రేగు కదలికలను మెరుగుపరుస్తాయి. నానబెట్టిన అత్తి పండ్లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. 
 

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అత్తి పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. వీటిని తినడం వల్ల మలబద్ధకం నుంచి డయేరియా వరకు ప్రతిఒక్క సమస్య నయమవుతుంది. అత్తి పండ్లు ప్రీబయోటిక్స్ కు ప్రధాన వనరు. ఇవి మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుపర్చడానికి కూడా సహాయపడతాయి.

anjeer

ఎముక సాంద్రతను పెంచుతుంది

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అత్తి పండ్లలో కాల్షియం, పొటాషియం లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ రెండింటి సాయంతో ఎముకల సాంద్రత మెరుగవుతుంది. దీనివల్ల బోలు ఎముకల వ్యాధి వంటి ఎముకల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. పొటాషియం అధికంగా ఉండే ఆహారం ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది ఒక అధ్యయనం కనుగొంది.
 

రక్తపోటును నియంత్రిస్తుంది

అధిక రక్తపోటు వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ కు కారణమని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది సాధారణంగా శరీరంలో సోడియం, పొటాషియం మొత్తంలో అసమతుల్యత వల్ల వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో మీ శరీరంలో సోడియం కంటెంట్ పెరుగుతుంది. పొటాషియం పరిమాణం తగ్గడం స్టార్ట్ అవుతుంది. 
 

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అత్తి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అత్తి పండ్లలో పాలీఫెనోలిక్ ఫ్లేవనాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అత్తి పండ్ల నుంచి మనకు కెరోటిన్, లుటిన్, టానిన్, క్లోరోజెనిక్ ఆమ్లం అందుతాయి. ఎండిన అత్తి పండ్లలో ఎక్కువ పోషకాలు ఉంటాయని మరొక అధ్యయనం వెళ్లడిస్తోంది. 
 

అంజీర పండ్లను డైటింగ్ భాగస్వామిగా చేసుకోండి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన అత్తిపండ్లను తినొచ్చు. ఈ నీటిలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ నీరు శరీరానికి  మేలు చేస్తాయి. కావాలనుకుంటే అప్పుడప్పుడు వీటిని డిన్నర్ లో కూడా చేర్చుకోవచ్చు.

మీ రోజువారీ ఆహారంలో దీన్ని ఎలా చేర్చాలి? 

అత్తి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పిండిలో కలిపి దాని నుంచి బ్రెడ్, కుకీలు లేదా కేకులను తయారు చేసుకుని తినండి. ఈ పండుతో  ఫ్రూట్ చాట్ ను కూడా తయారు చేయొచ్చు. అంతే కాకుండా ఎండుద్రాక్ష స్థానంలో ఖీర్ లో అంజీర పండ్లను కూడా కలుపుకోవచ్చు.

click me!