పాలతో ఈ ఫుడ్స్ ను తింటే మీ పని అంతే..!

First Published Jan 27, 2023, 2:55 PM IST

ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ఆహారాలను పాలతో అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకుంటే మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. 
 

Image: Freepik

తినే ఆహారాలను గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే మనం తినే ఆహారాలకు, ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. తిన్న ఫుడ్ మన శరీరానికి పడకపోతే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. అందుకే ఒకటి తింటుంటే దాని ప్రయోజనాలేంటి? దుష్ప్రభావాలేంటి? దాన్ని ఎలా తింటే మంచిది అన్న సంగతులను తెలుసుకోవాలంటారు నిపుణులు. 
 

ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ఆహారాలను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. అది ఎంతవరకు నిజమన్న దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అసలు విషయానికొస్తే పాలతో పాటు కొన్ని ఆహారాలు తినకూడదని ఇన్ స్టాగ్రామ్ వేదికగా న్యూట్రిషనిస్ట్ శిల్పా అరోరా అంటున్నారు. పాలు శరీరానికి శక్తిని పెంచే పానీయం. 100 మిల్లీ లీటర్ల ఆవు పాలలో 87.8 గ్రాముల నీరు ఉంటుంది. పాలలో 4.8 గ్రాముల పిండి పదార్థం, 3.9 గ్రాముల కొవ్వు, 3.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు పాలలో 120 మిల్లీగ్రాముల కాల్షియం, 14 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. 100 మిల్లీ లీటర్ల ఆవు పాలలో 66 కేలరీలు ఉంటాయి. సహజ స్వీటెనర్ అయిన లాక్టోస్ కూడా పాలలో ఉంటుంది. ఇంతకు పాలతో పాటుగా ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

protein rich foods

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు

పాలను, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కలిపి తీసుకోకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. మళ్లీ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే బరువు పెరుగుతారని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దీనివల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ ప్రోటీన్లను జీర్ణం చేయడానికి మన శరీరం జీర్ణం చేయడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. 

చేపలు

ఆయుర్వేదం ప్రకారం..  పాలు, చేపలను కలిపి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే పాలు, చేపలను కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన జీర్ణ సమస్యలు వస్తాయని ప్రాచీన వైద్యులు చెబుతున్నారు. న్యూట్రిషనిస్ట్ శిల్పా అరోరా ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. పాలు, చికెన్ ను కూడా కలిపి తినకూడదని చెబుతున్నారు. 
 

సిట్రస్ పండ్లు

ఆయుర్వేదం ప్రకారం.. పాలు, సిట్రస్ పండ్లను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయి. ఇవి పాలలో కలిసినప్పుడు పాలు విరిగిపోతాయి. అందుకే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను పాలలో కలపకూడదు. పాల తాగిన తర్వాత  సిట్రస్ పండ్లను ఆ వెంటనే తినడం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. 

click me!