పెరుగు ఫేస్ ప్యాక్స్ తో మొండి మచ్చలు మటుమాయం

First Published Jan 27, 2023, 1:59 PM IST

పెరుగులో లాక్టిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. పెరుగును ఫేస్ మాస్క్ గా ఉపయోగించడం వల్ల ముఖంపై ఉండే రంధ్రాలు, మొటిమల మచ్చలు, హైపర్ ఫిగ్మెంటేషన్ సమస్యలు తొలగిపోతాయి. 
 

పెరుగులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంగా బేషుగ్గా ఉంటుంది. శరీరం చల్లగా ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పెరుగు ఆరోగ్యానికే కాదు చర్మానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి  చాలా మందికి తెలియదు. పెరుగు చర్మాన్ని పునరుత్తేజపరచడానికి, నల్ల మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.

పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. దీనిని ఎన్నో రకాల క్రీములల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా పెద్ద రంధ్రాలు, మొటిమల మచ్చలు, హైపర్పిగ్మెంటేషన్ ను తొలగించడానికి పెరుగు సహాయపడుతుంది. అయితే మీ ముఖాన్ని అందంగా చేయాలనుకుంటే దీనిని రెండు విధాలుగా ఉపయోగించొచ్చు.  

ఒకటి

పెరుగు, తేనెలో ఉండే బ్లీచింగ్ పదార్థాలు చర్మంపై మృతకణాలను, పిగ్మెంటేషన్ ను తొలగించడానికి సహాయపడతాయి.పెరుగు, తేనె కలిపిన ఫేస్ మాస్క్ నల్లమచ్చలు, సన్నని గీతలను తగ్గిస్తుంది.  ఇందుకోసం 1 టీస్పూన్ పెరుగులో 2 టీస్పూన్ల తేనెను, నిమ్మరసాన్ని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి.
 

face pack

రెండు

పెరుగు, ఓట్ మీల్ తో తయారు చేసిన ఫేస్ మాస్క్ చర్మం, రంధ్రాలను లోతుగా శుభ్రపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ మాస్క్ తయారీ కోసం 2 టీ స్పూన్ల ఓట్ మీల్ పౌడర్ కు 1 టీస్పూన్ పెరుగు, రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఈ పేస్ట్ ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఈ ఫేస్ మాస్క్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి, చర్మ రంగును మెరుగుపరచడానికి, చర్మంపై మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

click me!