మీ కాలెయం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని మరువకుండా తినండి..

First Published Sep 19, 2022, 11:58 AM IST

కాలెయం మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం ఆరోగ్యకరమైన వాటినే తినాలి. 
 

LIVER

మన శరీరంలో కాలెయం ముఖ్యమైన అవయవం. ప్రోటీన్, కొలెస్ట్రాల్, పిత్తం ఉత్పత్తి, కార్భోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాల నిల్వ వంటి ఎన్నో ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. అంతేకాదు జీవక్రియ, ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు వంటి విషాలను విచ్చిన్నం చేస్తుంది. కానీ మనకున్న కొన్ని అలవాట్ల వల్ల కాలెయ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఫలితంగా కాలెయ సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మితిమీరి మద్యాన్ని తాగడం వల్ల కాలెయం దెబ్బతింటుంది. అలాగే హెపటైటిస్, ఓవర్ వెయిట్, డయాబెటీస్ వంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా కాలెయం దెబ్బతింటుంది. దీంతో కాలెయం చేసే ఎన్నో పనులు జరగవు. దీంతో మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ ముఖ్యమైన కాలెయాన్ని చాలా జాగ్రత్తగా చూసుుకోవాలి. దీని ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలు కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 

ద్రాక్షపండ్లు

ద్రాక్షపండ్లంటే చాలా మందికి ఇష్టం. తియ్యగా ఉండే  ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లకు ఏ లోటూ ఉండదు. ఇవే కాలెయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న లివర్ కణాలను రిపేర్ చేస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం.. హెపాటిక్ ఫైబ్రోసిస్ ను తగ్గించడానికి ద్రాక్షపండ్లు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ద్రాక్షపండ్లను తింటే కాలెయ ఆరోగ్యాన్ని దెబ్బతీసే కణజాలాలు అభివృద్ధి చెందే ప్రసక్తే ఉండదు. 

కొవ్వు చేపలు

చేపలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. అలాగే కాలెయంలో కొవ్వు నిల్వలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. కొవ్వు చేపలను తరచుగా తింటే కాలెయంలో ట్రైగ్లిజరైడ్లు, కొవ్వు తగ్గుతాయని ఓ పరిశోధన వెల్లడిస్తోంది. ఇకపోతే కొవ్వు చేపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఇవి కణాలను కూడా బాగు చేస్తాయి. ఈ కొవ్వు చేపలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

బీట్ రూట్ జ్యూస్

బీట్ రూట్ జ్యూస్ లో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం తప్పుతుంది. బీట్ రూట్ లో  యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా నేట్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగడం వల్ల గుండె హెల్తీగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే కాలెయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉండే మలినాలను తగ్గించడానికి సహాయపడుతుంది. కాలెయం పనితీరును మెరుగుపరుస్తుంది. 

హెర్బల్ టీలు

టీ, కాఫీల కంటే హెర్బల్ టీలే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తాగడం వల్ల కాలెయం ఆరోగ్యంగా పనిచేస్తుంది. అందుకే కోసమే పాలు పంచదార కలిపిన టీ, కాఫీ లకంటే గ్రీన్ టీనో లేకపోతే బ్లాక్ టీనో తాగండి. ఇవి లివర్ లో కొవ్వును స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే ఎంజైమ్ స్రావాలను కూడా పెంచుతాయి. ఇకపోతే  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి. ఈ హెర్బల్ టీలు ఎన్నో రకాల క్యాన్సర్ల ప్రమాదాలను కూడా తగ్గిస్తాయి. 
 

click me!