మీ భాగస్వామితో ఇలా ఉంటున్నారా...? అయితే... విడిపోవాల్సిందే..!

First Published | Sep 19, 2022, 11:45 AM IST

ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గుర్తించాలి. కానీ.... ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గుర్తించడం లేదు అంటే మాత్రం ఆ బంధానికి స్వస్తి పలకడమే ఉత్తమం.

దాంతప్య జీవితం ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు. అయితే... అందరి జీవితం ఆనందంగా సాగకపోవచ్చు. దంపతుల మధ్య మనస్పర్థలు, ప్రవర్తనలో తేడాల కారణంగా ఇలా ఏదో ఒక కారణంతో విడిపోతూ ఉంటారు. కొందరేమో.. తమ మధ్య విభేదాలు ఉన్నా.. విడిపోకుండా ఉంటారు. అయితే... దంపతుల మధ్య  ఇలాంటి సంకేతాలు ఉన్నాయి అంటే.. వారు కచ్చితంగా విడిపోవాల్సిందేనట. మరి అవేంటో ఓసారి చూద్దాం..


1.భార్యభర్తలు కలిసి ఉండటం.. ఉండకపోవడం వారి మధ్య ఉన్న అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. దంపతుల మధ్య గొడవ జరిగినప్పుడు.. ఈ వ్యక్తి తో ఇక ఉండలేము అనే ఫీలింగ్ కొందరిలో కలుగుతుంది. కానీ.. ఆ తర్వాత మళ్లీ ఆ ఫీలింగ్ రాకపోవచ్చు. కానీ... వారితో ఉన్న ప్రతిక్షణం.. ఈ వ్యక్తితో జీవితం కష్టంగా ఉంది.. ఉండలేము అనే భావన కలిగితే మాత్రం.. వారు వారి మనసు మాట వినడమే కరెక్ట్ అట. ఇది ఫస్ట్ రూల్. మీకు అలాంటి భావన కలిగితే.. వారికి దూరంగా ఉండటమే మంచిది. విడిపోవడమే ఉత్తమమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు.


2.దంపతులు ఆనందంగా ఉండాలి అంటే... వారు ఒకరికి మరొకరు మర్యాద ఇవ్వాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గుర్తించాలి. కానీ.... ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గుర్తించడం లేదు అంటే మాత్రం ఆ బంధానికి స్వస్తి పలకడమే ఉత్తమం.

3.దంపలు అన్నాక... ప్రతి నిమిషం కలిసి ఉండాలని రూలేమీ లేదు. పర్సనల్ స్పేస్ ఉండాలి.  అలా కాకుండా ప్రతి నిమిషం మీ దాంపత్య బంధం ఊపిరాడనివ్వకుండా చేస్తోంది అంటే... ఆ బంధానికి స్వస్తి పలకడమే మంచిది.

4.దాంపత్య బంధంలో ఒకరిని మరొకరు కంట్రోల్ చేయాలి అనుకోవడం తప్పు. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోవడానికి కూడా అనుమతి లేదు అంటే... ఆ బంధం ఆరోగ్యం గా లేదనే అర్థం.
 

5.మీ భాగస్వామి చేస్తున్న పనుల కారణంగా... మీ పై మీకు  చిరాకు కలగడం, మీ పై అసహ్యం కలుగుతున్నాయి అంటే... ఆ బంధానికి స్వస్తి పలకాలి. లేదంటే.. మీపై మీకు ఇష్టం పూర్తిగా పోయే ప్రమాదం ఉంది.


6.మీరు మీ జీవితంలో కాసేపు కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నారు అంటే.. మీరు ఒకరిపై ఆధారపడుతున్నారని అర్థం. మీరు ఒకరిపై ఆధారపడటం కూడా అంత మంచిది కాదు.

7.దాంతప్య జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే... ఇద్దరి వైపు నుంచి ఎఫర్ట్స్  పెట్టాలి. కానీ.. ఒక్కరు మాత్రం.. తమ బంధం స్ట్రాంగ్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు అంటే మాత్రం ఈ బంధానికి కూడా స్వస్తి పలకడమే ఉత్తమం.

Latest Videos

click me!