ఈ పండ్ల గింజలు విషంతో సమానం.. వీటిని పొరపాటున కూడా తినకండి..

First Published Aug 9, 2022, 3:24 PM IST

కొన్ని రకాల పండ్ల గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలను తింటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అయితే కొన్ని పండ్ల విత్తనాలను అస్సలు తినకూడదు. అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.
 

పండ్లతో పాటుగా పాటుగా వాటి గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చియా విత్తనాలు, పొద్దుతిరుగుడు, పుచ్చకాయ విత్తనాలు, వంటి మరెన్నో ఉన్నాయి. వీటిని తినడం ద్వారా శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. కానీ కొన్ని రకాల పండ్ల విత్తనాలను అస్సలు తినకూడదు. పొరపాటున తింటే ఆరోగ్యానికి ఎంతో హాని జరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఆపిల్ (Apple)

రోజుకు ఒక ఆపిల్ ను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. ఆపిల్ మంచిదే అయినా.. ఆపిల్ గింజలు మాత్రం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుంటే వీటిలో సైనైడ్ ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్లి విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

చెర్రీ (Cherry)

చెర్రీలు మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. కానీ చెర్రీ గింజల్లో హానికరమైన సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల ఆపిల్ తినడం వల్ల కలిగే నష్టాలే కలుగుతాయి.

ఆప్రికాట్ (Apricot)

ఆప్రికాట్ విత్తనాలలో విషపదార్థాలైన అమిగ్డాలన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఆప్రికాట్ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీనపడటమే కాదు.. ప్రాణాల మీదికి వస్తుంది. ఈ విత్తనాలు ఒక వ్యక్తిని కోమాలోకి తీసుకెళతాయి. 

పీచ్ (Peach)

 పీచ్ విత్తనాల్లో అమిగ్డాలిన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆప్రికాట్ విత్తనాల మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, నెర్వస్ నెస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. 
 

 పియర్ (Pear)

విత్తనాల్లో  ప్రాణాంతకమైన  సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వికారం, విరేచనాలు, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే చెమట, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది కోమాకు కూడా దారితీస్తుంది. 

click me!