ఈ రెండు పోషకాలను పెంచడానికి ఆహారం బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఐరన్, విటమిన్ బి 12 వివిధ ఆకు కూరలు, కాయలు, తృణధాన్యాలు మొదలైన వాటిలో పుష్కలంగా ఉంటాయి. ఇది ఐరన్ లోపాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పాలు, జున్ను, పెరుగుతో సహా అన్ని పాల ఉత్పత్తులతో పాటుగా చేపలు, రెడ్ మీట్, కాలేయం లేదా గుడ్లు విటమిన్ల గొప్ప మూలం. చిక్కుళ్ళు, బఠానీలు, బీన్స్, ఆకుకూరలు లేదా వోట్మీల్ వంటి తృణధాన్యాల్లో కూడా ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మీరోజు వారి ఆహారంలో చేర్చండి.