హై బీపీ పేషెంట్లు కాఫీని తాగకూడదా?

First Published Dec 24, 2022, 5:00 PM IST

రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు కాఫీని మోతాదుకు మించి తాగితే హృదయ సంబంధ వ్యాధుల మరణాల రేటు పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. 
 

రోజుకు  రెండు నుంచి నాలుగు కప్పుల కాఫీని తాగేవారు లేకపోలేరు. కాఫీ వల్ల అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు కాఫీని తాగడం మానుకోవాలని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 160/100 లేదా అంతకంటే ఎక్కువ రక్తపోటు ఉన్న రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీని తాగే వారు.. కాఫీని మొత్తమే తాగని వారితో పోలిస్తే గుండె జబ్బులతో చనిపోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది.
 

కాఫీని ఎక్కువగా తాగే అధిక రక్తపోటు పేషెంట్లు హృదయ సంబంధ వ్యాధులు వచ్చి తొందరగా చనిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. 

నిజానికి కాఫీని ఎక్కువగా తాగితే టైప్ 2 డయాబెటిస్, కొన్ని క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ ఆకలిని నియంత్రిస్తుంది. ఒత్తిడి,  నిరాశ ను తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించబడ్డాయి.
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీని తాగడం వల్ల మంచి జరుగుతుంది. చెడు కూడా జరుగుతుంది. కానీ కాఫీలో ఉండే కెఫిన్ రక్త నాళాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. దీంతో రక్తపోటును విపరీతంగా పెరిగిపోతుంది. మెదడులోని వివిధ గ్రాహకాలతో సంగర్షణ చెందడం ద్వారా కెఫిన్ దాని ప్రభావాన్ని చూపుతుంది. 
 

ఒక వ్యక్తి తాగే కాఫీ మొత్తం పరిమాణం రక్తపోటును నిర్ణయిస్తుందని కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కాఫీలో కెఫిన్ కాకుండా ఇతర సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ ఇతర సమ్మేళనాలు కూడా రక్తపోటుపై ప్రభావాన్ని చూపుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 
 

కాఫీలో ఉండే కెఫిన్ నిద్రను పోగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రపట్టడానికి చాలా సమయం పడుతుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఇది మొత్తం నిద్ర సమయాన్ని బాగా తగ్గిస్తుంది. ముఖ్యంగా పెద్ద వయసు వారిలో. 
 

కెఫిన్  కడుపు ఉత్పత్తి చేసే గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ విడుదలకు దారితీస్తుంది. అంతేకాదు ఈ కెఫిన్ కొంతమందిలో వదులుగా మలం లేదా విరేచనాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
చాలా సంవత్సరాలుగా కాఫీని తాగితే కడుపు పూతలకి కారణమవుతుందని చెబుతున్నారు. 

కొన్ని అధ్యయనాలు కెఫిన్ పానీయాల వల్ల  కొంతమందిలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జిఇఆర్డి) మరింత తీవ్రతరం అవుతుందని వెల్లడిస్తున్నాయి. ఇది జీర్ణ పనితీరుపై చెడు ప్రభావాన్ని కూడా చూపుతుంది. అందుకే కడుపుకు సంబంధించిన సమస్యలుంటే కాఫీని తాగకపోవడమే మంచిది. 

coffee

రాబ్డోమియోలిసిస్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి. దీనిలో దెబ్బతిన్న కండరాల ఫైబర్స్ రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఇది మూత్రపిండాల వైఫల్యం , ఇతర సమస్యలకు దారితీస్తుంది. రాబ్డోమియోలిసిస్ సాధారణ కారణాలు.. గాయం, సంక్రమణ, మాదకద్రవ్యాల దుర్వినియోగం, కండరాల ఒత్తిడి, విషపూరిత పాములు లేదా కీటకాల కాటు. కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రాబ్డోమియోలిసిస్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాగా కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె కొట్టుకునే వేగం బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  
2018లో చేసిన అధ్యయనం ప్రకారం ప్రతిరోజు కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఆరు శాతం తక్కువని తేలింది. అంతేకాదు కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యం ఎక్కువని తేలింది. 

click me!