పొద్దు పొద్దున ఎండలో కూర్చోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో..

First Published Nov 27, 2022, 12:52 PM IST

ఉదయం కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల మన శరీరానికి విటమిన్ డి అందడమే కాదు ఎముకలు బలంగా ఉంటాయి. నిద్రతో సహా ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. 
 

Image: Getty Images

ఉదయం కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి అంతుతుంది. మన దేశంలో సూర్యరశ్మికి కొరత లేదు. కానీ విటమిన్ డితో బాధపడేవారి సంఖ్య మాత్రం ఎక్కువే. భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. తీరిక లేని పనుల కారణంగా చాలా మంది సూర్యరశ్మిని పొందలేకపోతున్నారు. నిజానికి సూర్యరశ్మి మనకు విటమిన్ డిని ఇవ్వడమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. సూర్యరశ్మిలో ఎన్ని గంటలు ఉండాలి.. దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సూర్యకిరణాలు ఎంత సేపు శరీరాన్ని తాకాలి?
 
సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకాలన్న ముచ్చట అందరికీ తెలుసు.. కానీ సూర్య రశ్మిలో ఎంతసేపు ఉండాలన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. ఉదయం సూర్యోదయానికి నిద్రలేచే వారు ఐదు నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 25 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం శరీరానికి ఎంతో మంచిది. 
 

సూర్యోదయానికి అరగంట ముందు, సూర్యాస్తమయానికి అరగంట ముందు 20 నుంచి 25 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. దీనివల్ల మన శరీరానికి విటమిన్ డి అందడమే కాదు ఎముకలు బలోపేతం  అవుతాయి. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఎన్నో హార్మోన్ల విడుదలకు సహాయపడుతుంది.

ఏడాదిలో 40 రోజులు.. 40 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండటం చాలా అవసరం. దీనివల్ల విటమిన్ డి లోపం ఉండదు. సూర్యకిరణాలు మిమ్మల్ని సరిగ్గా తాకనప్పుడు గుండెజబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్, పునరుత్పత్తి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

20 నిమిషాలపాటు ఎండలో కూర్చోవడం కలిగే ప్రయోజనాలు

ఒత్తిడి తగ్గుతుంది

సూర్యకిరణాలలో చాలా శక్తి ఉంటుంది. రోజుకు 25 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో కూర్చుంటే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

నిద్రలేమి సమస్య తగ్గిపోతుంది

ఉదయం 20 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడతారు. నిద్రకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. సూర్య రశ్మి వల్ల రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు. సూర్య కిరణాలు మెలటోనిన్ స్థాయిలను పెంచడానికి, తగ్గించడానికి సహాయపడతాయి. ఈ మెలటోనిన్ స్థాయి రాత్రిళ్లు ఎక్కువగా ఉంటే ప్రశాంతంగా పడుకుంటారు. చాలా కాలం నుంచి సూర్యరశ్మిలో ఉన్న వ్యక్తి పడుకునే సమయంలో అతనిలో మెలటోనిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. 
 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ప్రతిరోజూ సూర్యరశ్మిలో నిలబడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల నుంచి శరీరానికి శక్తి లభిస్తుంది. వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇది ఎన్నో అంటువ్యాధులు, క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బ

రక్త ప్రవాహానికి మంచిది

ప్రతిరోజూ 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల శరీరానికి వేడి అందుతుంది. చలి కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. అయితే శరీరం వేడెక్కినప్పుడు రక్తప్రసరణ పెరుగుతుంది. 

click me!