రెయిన్ బో డైట్ తో ఎన్ని రోగాలకు దూరంగా ఉండొచ్చో తెలుసా?

First Published Nov 27, 2022, 11:52 AM IST

రంగు రంగుల ఆహారం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇంద్రధనస్సు రంగు ఫుడ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

పండ్లు, కూరగాయలను పుష్కలంగా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. కానీ ఇంద్రధనస్సు ఆహారం దీని కంటే మరింత ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంద్రధనస్సు రంగు ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో వ్యాధులను దూరం చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఇంద్రధనస్సు ఆహారాన్ని సులువుగా తయారు చేసుకోవచ్చు. 

ఇంద్రధనుస్సు ఆహారంలో.. ఇంద్రధనుస్సులో ఉండే ప్రతి ఒక్క రంగులో ఆహారం ఉంటుంది. ప్రతి ఒక్క పండు, కూరగాయలో ఫైటోన్యూట్రియెంట్ ఉంటుంది. ఇది వాటికి రంగును ఇస్తుంది. కానీ ప్రతి రంగు ఆహారం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇంద్రధనస్సు ఆహారాన్ని ఎలా తయారుచేసుకోవాలి? ఏ రంగు ఆహారం ఎలాంటి వ్యాధులను దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఎరుపు రంగు ఆహారాలు

రెయిన్ బో డైట్ లో ఉండే ఎరుపు రంగు ఆహారాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎరుపు రంగు ఆహారాన్ని తినడం వల్ల సూర్యరశ్మితో చర్మానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. టమోటాలు, పుచ్చకాయలు, గులాబీ జామకాయలు, ద్రాక్షపండ్లు, ఆపిల్స్, స్ట్రాబెర్రీలు మొదలైనవి ఎరుపు రంగు ఆహారాలు.
 

పసుపు, నారింజ రంగు ఆహారాలు

పసుపు, నారింజ రంగు ఆహారాలు కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్ నుంచి మనల్ని రక్షిస్తాయి. క్యారెట్లు, అరటిపండ్లు, పైనాపిల్స్, గుమ్మడికాయలు, మొక్కజొన్న పసుపు, నారింజ రంగు ఆహారాలు.
 

గ్రీన్ కలర్ ఫుడ్స్

రెయిన్ బో డైట్ లో గ్రీన్ కలర్ చాలా ముఖ్యం. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బచ్చలికూర, క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ, అవోకాడో  మొదలైన ఆకు పచ్చ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

నీలం,  ఊదారంగు ఆహారాలు

రెయిన్ బో డైట్ లో నీలం, ఊదారంగు ఆహారాలు మెదడును ఉత్తేజపరుస్తాయి. వీటిని తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్, న్యూరోలాజికల్ వ్యాధులు, గుండె జబ్బులు,  కొన్ని రకాల క్యాన్సర్లు దూరమవుతాయి. నీలం, ఊదారంగు రంగు.. పండ్లు, వంకాయలు, ఎరుపు-ఊదారంగు క్యాబేజీ, ద్రాక్ష పండ్లలో కనిపిస్తుంది.
 

ముదురు ఎరుపు ఆహారాలు

రెయిన్ బో డైట్ లో ముదురు ఎరుపు రంగు కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ముదురు ఎరుపు ఆహారాలు అథ్లెటిక్ పనితీరును కూడా పెంచుతాయి. బీట్ రూట్, ముళ్ల జామకాయలు ముదురు ఎరుపు రంగు ఆహారాలు.
 

తెలుపు, గోధుమ రంగు ఆహారాలు

తెలుపు, గోధుమ రంగు ఆహారాలను కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ రంగు ఆహారాలను తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వీటిని తినడం వల్ల ఫైబర్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 లభిస్తాయి. క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, తెల్ల బంగాళాదుంపలను రెయిన్ బో డైట్ లో చేర్చుకోవచ్చు.

click me!