చలికాలంలో మడమల పగుళ్లు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

First Published Nov 27, 2022, 10:42 AM IST

చలికాలంలో మడమలు ఎక్కువగా పగుళుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ కాలంలో మీ పాదాలు పగిలిపోకుండా ఉంటాయి. అలాగే అందంగా తయారవుతాయి కూడా..
 

చలికాలంలో దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్, జ్వరంతో పాటుగా ఎన్నో రకాల రోగాలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో పాదాల మడమలు పగులుతుంటాయి. అయితే పాదాల్లో ఆయిల్ కంటెంట్ తగ్గినప్పుడు చర్మం పొడిబారుతుంది. దీంతో పగుళ్లు వస్తాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాదాల పగుళ్లకు దూరంగా ఉండొచ్చు. అవేంటంటే.. 
 

వేడి నీటితో పాదాలను కడగొద్దు

చలికాలంలో చాలా మంది పాదాలను వేడి నీళ్లతో కడుగుతుంటారు. కానీ ఇలా కడగకూడదంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ వేడి నీళ్లతో పాదాలను కడిగితే తేమ తగ్గుతుంది. దీంతో పగుళ్లు వస్తాయి. అందుకే గోరు వెచ్చని నీళ్లలో పాదాలను ఎక్కువ సేపు నానబెట్టకండి. 
 

సబ్బును ఎక్కువగా పెట్టకూడదు

చలికాలంలో సబ్బును ఎక్కువగా వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. తేమను తగ్గిస్తుంది. అందుకే సబ్బును మితిమీరి ఉపయోగించకండి. ఈ సీజన్ లో కలబంద కలిపిన లేపనాలను ఉపయోగించడం మంచిది. 
 

కొబ్బరి నూనెతో మసాజ్

పాదాలు, మడమలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సీజన్ లో మీ పాదాలకు కొబ్బరి నూనె లేదా ఇతర నూనెలతో మసాజ్ చేయండి. దీనివల్ల తేమ శాతం పెరుగుతుంది. అలాగే రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల పగుళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. 
 

ఉప్పు

పాదాల పగుళ్లను నివారించడంలో ఉప్పు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి.. మీ పాదాలను అందులో ముంచండి. రోజూ 20 నిమిషాల పాటు ఇలా చేస్తే పాదాల పగుళ్లు తగ్గిపోతాయి. 
 

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కూడా పాదాల పగుళ్లను తగ్గిస్తుంది. ఇందుకోసం చిన్న బకెట్ లో గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో బేకింగ్ సోడా, ఉప్పు వేయండి. అందులో 15 నిమిషాల పాటు మీ పాదాలను నానబెట్టండి. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 

నిమ్మకాయ

పాదాల సంరక్షణకు నిమ్మకాయ ఉత్తమమైంది. గోరు వెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మకాయ రసం వేసి మీ పాదాలను అందులో ముంచండి. ఆ తర్వాత మీ పాదాలకు నిమ్మకాయ రసం రుద్దండి. దీనివల్ల మీ పాదాలు అందంగా మారతాయి. 
 

గోరు వెచ్చని నీటిలో షాంపూను, నాలుగు చుక్కల నిమ్మరసం కలపండి. ఈ నీళ్లలో మీ పాదాలను ముంచండి. 30 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మీ పాదాలు స్మూత్ గా, అందంగా తయారవుతాయి. 

click me!