గుడ్డులోని పచ్చసొన ప్రయోజనాలు
గుడ్డు పచ్చసొనలో కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లన్నీ కండరాల నిర్మాణానికి ఎంతగానో సహాయపడతాయి. శరీరంలో బయోటిన్ వంటి సమ్మేళనాలను ప్రోత్సహిస్తాయి కూడా. ఉండాల్సిన బరువు కంటే మరీ సన్నగా ఉన్నవారు లావు కావడానికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ ముఖం అందంగా మెరిసిపోవడానికి కూడా సహాయపడుతుంది. మన శరీరంలో ప్రోటీన్ లోపం వల్ల కలిగే లక్షణాలను తొలగించడానికి కూడా ఇది సహాయపడుతుంది.