తక్కువ సేపు పడుకోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలేంటో తెలుసా..?

First Published Aug 22, 2022, 11:44 AM IST

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్ గా రాత్రిపూట 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. ఇంతకు తక్కువ గంటలు  పడుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. 

మనిషికి నిద్ర అవసరం కాదు.. అత్యవసరం. ఎందుకంటే నిద్రపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. మీరెంత హెల్తీ ఫుడ్ ను తిన్నా.. ఖచ్చితంగా ఏడెనిమిది గంటలు మాత్రం నిద్రపోవాల్సిందే. కానీ మనలో చాలా మంది.. పని, సెల్ ఫోన్లు, టీవీ, ల్యాప్ టాప్ లల్లో ఎక్కువ సేపు గడుపుతూ కంటి నిండా నిద్రపోవడం లేదు. కానీ నిద్రలేమి, తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిపూట ప్రతిరోజూ కనీసం 6 గంటల నుంచి 8 గంటలైనా నిద్రపోవాలి. అయితే మీరు సరిగ్గా నిద్రపోకున్నా.. నిద్రరాకున్నా.. మీ రోగ నిరోధక వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. నిద్రలేమి వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల బారిన పడే ప్రమాదముంది. అంతేకాదు ఈ నిద్రలేమి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లు మీకు సులువుగా సోకడానికి కారణమవుతుంది. మీకు తెలుసా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికే జలుబు, జ్వరం వంటివి తరచుగా వస్తాయని పలు అధ్యయనాలు నిరూపించాయి. వీటితో పాటుగా వీరు ఏం పనిచేయకపోయినా ఉన్నట్టుండి బాగా అలసిపోతారు. 

నిద్ర తక్కువగా పోయే వారు బరువు ఎక్కువగా ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమితో బాధపడేవారికి ఆకలిని నియంత్రించే హార్మోన్లు తక్కువగా ఉంటాయి. దీంతో వీరు మోతాదుకు మించి తినేస్తుంటారు. ఫలితంగా వీళ్లు విపరీతంగా బరువు పెరిగిపోయే ప్రమాదముంది. ఈ రకమైన ఊబకాయం భవిష్యత్తులో ఎన్నో భయంకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

కంటినిండా నిద్రలేకపోవడం వల్ల ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. చేస్తున్న పనిపట్ల కూడా శ్రద్ధ ఉండదు. మీర బాగా నిద్రపోయినప్పుడు మాత్రమే ఎనర్జిటిక్ గా, రీఫ్రెష్ గా ఉంటారు. పనులను కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తారు. అయితే మానసిక ఒత్తిడికి, నిద్రలేమికి సంబంధం ఉందని అధ్యయనాలు చెబతున్నాయి. 

తక్కువ నిద్రపోవడం వల్ల రక్తపోటు విపరీతంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రించడానికి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం కూడా పిల్లల్లో Learning disability దారితీస్తుందట. ఇక పెద్దవారికి మతిమరుపు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

రాత్రిపూట మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. అందుకే రాత్రి పడుకునే రెండు గంటల ముందు నుంచి ఫోన్లను టీవీలను చూడటం మానేయండి. అలాగే రెగ్యులర్ గా యోగా లేదా వ్యాయామాలను చేయండి. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టేసి హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇదే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

click me!