గుడ్లు, ఆముదం, నిమ్మకాయ మీ పాదాల పగుళ్లలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ముందుగా గుడ్డును పగలగొట్టి పచ్చసొనను తీసివేసేయండి. దీనిలో కొన్ని చుక్కల ఆముదం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపండి. దీనికి ఒక స్పూన్ బియ్యప్పిండిని కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాల పాటు కూల్ ప్లేస్ లో పెట్టండి. అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు మీ పాదాలను శుభ్రంగా గోరువెచ్చని నీటితో కడగండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మీ పాదాలకు రాయండి. 10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. వారానికి మూడు సార్లు ఈ పద్దతిని ఫాలో అవ్వండి. ఈ మిశ్రమాన్ని పగటిపూట లేదా రాత్రిపూట అప్లై చేయొచ్చు.