వ్యాయామం చేయకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ పనులను చేసేయండి..

First Published Aug 22, 2022, 9:57 AM IST

బరువు పెరిగిన చాలా మంది కడుపు మాడ్చుకుని మరీ జిమ్ములల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటారు. మీకు తెలుసా.. ఇంటి పనులు చేస్తే .. ఎంతటి బాన పొట్ట అయినా సరే ఇట్టే కరిగిపోతుందని ఓ కొత్త అధ్యయనం తెలియజేస్తుంది.. 
 

బరువును తగ్గించుకునేందుకు చాలా మంది చేసే పని.. జిమ్ముల్లో గంటల తరబడి వ్యాయామం చేయడం. ఇంకోటి కడుపును మాడ్చడం. తినాలని ఉన్నా.. తింటే ఎక్కడ బరువు పెరిగిపోతామేమోనని భయపడి తినడమే మానేసేవారున్నారు. నిజానికి  బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతెందుకు జిమ్ముల్లో గంటల తరబడి చెమటలు చిందించాల్సిన అవసరం కూడా లేదంటున్నారు పరిశోధకులు. ఓ కొత్త పరిశోధన ప్రకారం.. బరువు తగ్గాలన్నా.. మజిల్స్ పెరగాలన్నా.. వ్యాయమం ఏం చేయర్కర్లేదని  పరిశోధన తెలియజేస్తుంది.

పరిశోధన ఏం చెప్తుందంటే.. 

వ్యాయామం చేసేవారిపై జపాన్ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. ఇక ఈ అధ్యయనంలో వ్యాయామం చేసేవారిని నాలుగు వారాల పాటు పరిశీలించారు. అయితే వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. అయితే వీరు ఎలాంటి ఎక్సర్ సైజెస్ చేస్తున్నారు.. వారి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయి వంటి విషయాలను గమనించారు. అయితే జిమ్ముల్లో కష్టపడే వారి కంటే ఇంట్లో పనిచేసే వారే ఎక్కువ కేలరీలు తగ్గించారట. అంతేకాదు మజిల్స్ కూడా పటిష్టంగా అయ్యాయట. 
 

ఇంటి పనులతోనే 

చేతులు, కాళ్లను బలంగా చేసేందుకు ఎన్నో రకాల ఎక్సర్ సైజ్లు చేస్తుంటారు. వీటికి బదులుగా ఇంట్లో రకరకాల పనులు చేస్తే కూడా  చేతులు బలంగా అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం జిమ్ముల్లోనే చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డంబెల్స్ తో ఎక్సర్ సైజెస్ లు చేయాల్సిన అవసరం లేదు. చేతి కండరాలు బలంగా తయారవ్వాలంటే  ఇంట్లో పనులు చేసినా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు తగ్గాలని చాలా మంది ఎన్నో  రకాల ఎక్సర్ సైజెస్ ను చేస్తుంటారు. అయితే శారీరక శ్రమ చేసినా.. సులువుగా బరువు తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి బరువు తగ్గాలనుకునేవారు ఎటైనా వెళ్లాల్సి వస్తే బైక్ కు బదులుగా నడవడమో లేకపోతే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్లడమో చేయాలని సూచిస్తున్నారు. 

weight loss

ఇలా చేస్తే బరువు పెరిగే ప్రసక్తే ఉండదు.. 

మీరు గమనించారో లేదో.. ఇంట్లో అన్ని పనులను చేసే చాలా మంది ఆడవారు అధిక బరువు ఉండరు. ఎందుకంటే వీరు వంగడం, నడవడం, వంటి ఎన్నో పనులను చేస్తుంటారు. ముఖ్యంగా వంగి పనులను చేయడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అంతేకాదు వంగి చేసే పనుల వల్ల పొట్ట, నడుము కొవ్వులు ఫాస్ట్ గా కరిగిపోతాయి. అక్కడ కొవ్వు పేరుకుపోయే ప్రమాదమే ఉండదు. ఇక శారీరక శ్రమతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. నోటిని ఊరించిందని ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను తింటే మీ బరువును ఏం చేసినా తగ్గించుకోలేరు. 
 

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అతిగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రాణాలను తీస్తుంది. ఈ మధ్యనే ఇలా వ్యాయామాల మధ్యలో ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. బరువు తగ్గాలని అతిగా వ్యాయామం చేయకుండా.. రోజూ చిన్న చిన్న వ్యాయామాలను కొద్ది సేపు మాత్రమే చేయండి. ఇది మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. 

click me!