శొంఠి మంచిదా? పచ్చి అల్లం మంచిదా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుందంటే..

Published : Aug 30, 2022, 03:58 PM IST

ఆయుర్వేదం ప్రకారం.. పచ్చి పచ్చి అల్లం కంటే శొంఠే మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిది. ఎందుకంటే ఇది పచ్చి అల్లం కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుంది.  

PREV
16
శొంఠి మంచిదా? పచ్చి అల్లం మంచిదా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాలను కలిగిస్తుందంటే..

అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి.  ఇది ఎన్నో రోగాలను నయం చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఆయుర్వేదంలో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. మన వంటింట్లో కూడా ఇది తప్పనిసరిగా ఉంటుంది. అల్లాన్ని వంటల్లోనే కాదు టీ లో కూడా వేస్తారు.  అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. చిన్న అల్లం ముక్కను తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య పోతుంది. కడుపు కూడా శుభ్రపడుతుంది. 

26

అయితే అల్లంను ఎండబెట్టి పొడి చేసి కూడా వాడుతుంటారు. దీన్నే శొంఠి అంటారు. నిజానికి పచ్చి అల్లంలో పోల్చితే శొంఠే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ శొంఠి వల్ల ఎన్నో రకాల ఫ్లూ లు దూరమవుతాయి.  ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. అంతేకాదు జలుబు నుంచి కూడా ఉపశమనం పొందుతారు. శొంఠి వల్ల కలిగే  ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.. 

36

వాతం తగ్గుతుంది

శొంఠిని తీసుకోవడం వల్ల వాతం సమస్య తగ్గుతుంది. అదే పచ్చి అల్లాన్ని తీసుకుంటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో శొంఠీనే ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

46

మలబద్దకం తగ్గుతుంది

మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడంలో శొంఠి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకో ఉదయం పూట గ్లాస్ నీటిలో శొంఠిని మిక్స్ చేసి తాగితే మలబద్దకం సమస్య తొందరగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

56

కఫం తగ్గితుంది

వానాకాలం, చలికాలంలో జలుబు ఎక్కువగా అవుతుంది. ఇవ దీనివల్ల చాలా మంది కఫం సమస్యను ఫేస్ చేస్తారు. అయితే దీన్ని తగ్గించేందుకు శొంఠి అద్బుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో శొంఠి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది. 
 

66

బరువును తగ్గిస్తుంది

శొంఠి బరువును కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం ఉదయం ఖాళీకడుపున గ్లాస్ నీటిని తీసుకుని అందులో కొద్దిగా శొంఠిని వేడి బాగా మరిగించాలి. దీన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిగా తాగాలి. ఈ డ్రింక్ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా  కరిగిస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories