శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండెపోటు, అధిక రక్తపోటు, డయాబెటీస్, ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసల్ డిసీజ్ వంటి రోగాలకు అధిక కొలెస్ట్రాల్ యే కారణమవుతుంది.
29
cholesterol
మీ జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే కొలెస్ట్రాల్ ను సులువుగా కరిగించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
39
వెల్లుల్లి
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు ప్రతి రోజూ 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
49
పాలు, పంచదార కలిపిన టీ మొత్తానికే తాగకూడదు. ఇది మీ శరీర బరువును పెంచడమే కాదు.. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ ను కూడా వేగంగా పెంచుతుంది. ఈ టీకి బదులుగా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి. గ్రీన్ టీ కొవ్వును కరిగించడంలో ఎఫెక్టీవ్ పనిచేస్తుంది.
59
అవిసె గింజలు
అవిసె గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, లినోలెనిక్ ఆమ్లం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
69
ఆకు పచ్చ కూరగాయలు
ఆకు పచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకుంటూ .. నూనె పదార్థాలను తక్కువగా తింటే కొలెస్ట్రాల్ దానంతట అదే కరగడం స్టార్ట్ అవుతుంది.
79
కొలెస్ట్రాల్ పెరగకూడదనుకునే వారు రోజూ పసుపు పాలను తాగడం అలవాటు చేసుకోవాలి. పసుపు పాలను తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
89
ఈ అలవాట్లను మానుకోవాలి
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు ఖచ్చితంగా స్మోకింగ్ చేయకూడదు. ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. అంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
99
ఆయిలీ ఫుడ్స్, సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బయటి ఫుడ్ ను తినకపోవడమే మంచిది. కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామాలు చేయాలి. వీటన్నింటినీ పాటిస్తేనే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.