చక్కెరతో పోల్చితే బెల్లమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ చాలా మంది బెల్లం కంటే చక్కెరనే ఎక్కువగా తింటుంటారు. మీకు తెలుసా.. బెల్లం ఆరోగ్య ప్రయోజనాల భాండాగారం. దీనిలో ఐరన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ప్రయోజనకరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కడుపులో గ్యాస్, చెడు శ్వాసను దూరం చేయడానికి సహాయపడుతుంది. బెల్లాన్ని నేరుగా తినేవారు చాలా మంది ఉన్నారు. కానీ మీ ఆహారంలో బెల్లం జోడించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి.