చలికాలంలో చర్మ సమస్యలు.. తగ్గడానికి ఈ ఫేస్ ప్యాక్స్ బెస్ట్

First Published Jan 7, 2023, 2:04 PM IST

చలికాలంలో ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. డ్రై స్కిన్, మొటిమలు, మచ్చలు వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని రకాల ఫేస్ మాస్క్ లు ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. 

Image: Getty Images

చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువవుతుంటాయి. ముఖంపై మొటిమలు, దురద, చర్మ రంగు మారడం, డ్రై స్కిన్ వంటి ఇతర సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి  కొంతమంది ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఇంకొంతమంది మాత్రం చర్మవ్యాధి నిపుణుల సహాయం తీసుకుంటారు. నిజానికి ఈ సీజన్ లో వచ్చే చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..

కొబ్బరి పాల ఫేస్ ప్యాక్

మెరుస్తున్న చర్మానికి కొబ్బరి పాల ఫేస్ ప్యాక్ ఉత్తమమైన నేచురల్ ఫేస్ ప్యాక్. ఇది మొటిమలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. అలాగే ఇది ఎన్నో చర్మ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా పోషణను అందిస్తుంది. ఇందుకోసం కొద్దిగా కొబ్బరిని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి అందులో నీళ్లు పోసి చిక్కటి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను మీ ముఖానికి, మెడకు అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇది మీ ముఖాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్

పసుపు చర్మం పొడి బారడాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మొటిమలను, మొటిమల వల్ల అయ్యే మచ్చలను తగ్గించడానికి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయడానికి సహాయపడుతుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇందుకోసం పెరుగు, పసుపును బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. మీరు ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు అప్లై చేయొచ్చు. పెరుగు చర్మాన్ని మరింత కాంతివంతంగా తయారుచేస్తుంది. అలాగే నల్లటి మచ్చలను, పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ ట్యాన్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది.
 

తేనె, పండిన అరటి ప్యాక్

పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, మచ్చలను తొలగించడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. తేనె, పండిన అరటి చర్మాన్ని తేమగా చేస్తాయి. అలాగే చర్మాన్ని అందంగా ఉంచుతాయి. ముందుగా అరటిపండ్లు, తేనెను కలిపి ఫేస్ ప్యాక్ ను తయారు చేయండి. ఆ తర్వాత దాన్ని ముఖమంతా బాగా అప్లై చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు.  
 

click me!