చిలగడదుంపలను కాల్చి తింటే మంచిదా? ఉడికించి తింటే మంచిదా?

First Published Dec 27, 2022, 12:58 PM IST

కొంతమంది చిలగడదుంపను కాల్చుకుని తింటేనే  ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. ఇంకొంత మంది వీటిని ఉడికించి తింటేనే మంచిదని అంటారు. అసలు వీటిని ఎలా తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

చలికాలం ఉత్తమ ఆహారాల్లో చిలగడదుంపలు ఒకటి. ఈ సీజన్ లో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తినాల్సి ఉంటుంది. చిలగడదుంపలు పోషకాలకు మంచి వనరు. వీటిలో డైటరీ ఫైబర్, విటమిన్ సి, బి విటమిన్లు, ఖనిజాలతో పాటుగా మరెన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అయితే ఈ తీపి బంగాళాదుంపలను రెండు పద్దతుల్లో తింటుంటారు. ఒకటి ఉడికించి, రెండు కాల్చి. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఈ రెండు పద్దతుల్లో ఏ రకంగా తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

చిలగడదుంపల ఆరోగ్య ప్రయోజనాలు

చిలగడదుంపలు, బంగాళాదుంపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయినప్పటికీ చిలగడదుంపలే సాధారణ బంగాళాదుంపల కంటే విటమిన్ ఎ స్థాయిలను ఎక్కువగా కలిగి ఉంటాయి.
 

sweet potato

చిలగడదుంపలో.. తెల్ల బంగాళాదుంపల్లో కంటే 50 శాతం ఎక్కువ ఫైబర్ ఉంటుంది తెలుసా? అంతేకాదు చిలగడదుంపలు సాధారణ బంగాళాదుంపల కంటే తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అంటే అవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం చాలా చాలా తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Sweet potato

కాల్చిన చిలగడదుంప వర్సెస్ ఉడికించిన చిలగడదుంప

చలికాలంలో చిలగడదుంపలను తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. అయితే దీన్ని అప్పటికప్పుడే వండటానికి వీలు లేదు. దీన్ని ఉడకబెట్టాలన్నా లేదా కాల్చాలన్నా.. ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీని నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి మీరు ఈ తీపి బంగాళాదుంపలను వండటానికి మంచి పద్ధతిని ఎంచుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. 
 

కాల్చిన, ఉడికించిన చిలగడదుంపల మధ్య తేడా..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉడకబెట్టడం వల్ల తీపి బంగాళాదుంపలు మృదువుగా తయారవుతాయి. ఈ పద్దతి వల్ల వాటి రుచి మాత్రం పెద్దగా మెరుగుపడదు.
 

sweet potato

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఏది మంచిది?

గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) విలువ అనేది కొన్ని ఆహారాలు మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత పెంచుతాయో కొలవడానికి ఉపయోగించే విలువ. తీపి బంగాళాదుంపల జిఐ రకాలు, తయారీ పద్ధతిని బట్టి 44 నుంచి 94 వరకు ఉంటుంది. కాల్చిన చిలగడదుంపలు, ఉడకబెట్టిన వాటి కంటే ఎక్కువ జిఐని కలిగి ఉంటాయి. సాధారణ బంగాళాదుంపలలో వేరియబుల్ జిఐ కూడా ఉంటుంది.
 

వీటిలో ఏది ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాల్చిన బంగాళాదుంపలో 173 గ్రాముల కేలరీలు ఉంటాయి. అదే కాల్చిన చిలగడదుంపలో సుమారు 160 కేలరీలు ఉంటాయి. ప్రతి దానిలో 4 గ్రాముల ప్రోటీన్, 37 గ్రాముల పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. అయితే ఏ బంగాళాదుంపలలోనూ కూడా కొవ్వు ఉండదు.
 

వీటిలో ఏది పోషక విలువలను కలిగి ఉంటుంది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తీపి బంగాళాదుంపల్లో మెగ్నీషియం, భాస్వరం, రాగి, జింక్, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఉడికించిన చిలగడదుంపల్లో పుష్కలంగా ఉండే కాల్షియం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ కాల్చిన బంగాళాదుంపలో 926 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. 

ఏది మెరుగైన ప్రత్యామ్నాయం?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాల్చిన లేదా ఉడికించిన బంగాళాదుంపలకు బదులుగా ఉడికించిన చిలగడదుంపలను తీసుకోవచ్చు. వీటిని డెజర్ట్ లు,సూప్లకు కూడా జోడించొచ్చు. 

click me!