శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ శరీరంలో ఇది తగ్గినట్టే..

Published : Dec 27, 2022, 11:59 AM ISTUpdated : Dec 27, 2022, 12:13 PM IST

శరీరంలో ఐరన్ లోపిస్తే.. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గుతాయి. కానీ సమతుల్య ఆహారం తీసుకుంటే.. మీ శరీర శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా నయమవుతాయి. అయితే మన శరీరంలో ఇనుము లోపిస్తే శ్వాస తీసుకోవడంలో  ఇబ్బంది కలుగుతుంది.   

PREV
18
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ శరీరంలో ఇది తగ్గినట్టే..

ఏ వయసు వారైనా ఇనుము లోపంతో బాధపడొచ్చు. ఇనుము మన రక్తంలో ఒక ముఖ్యమైన భాగం. ఆక్సిజన్ స్థాయిలను నియంత్రించడానికి మన శరీరానికి తగినంత హిమోగ్లోబిన్ అవసరం. మనం తీసుకునే ఆహారంలో తగినంత ఇనుము లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మానసిక స్థితి దెబ్బతింటుంది. మైకం లక్షణాలు కూడా కలగొచ్చు. ఎందుకంటే ఇనుము లోపించిన వారి శరీరం సోమరితనంగా మారతుంది. ముందే ఇప్పుడు మళ్లీ కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి.  ఇనుము మన శరీరంలో పుష్కలంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.. అందుకే ఇది ఎక్కువగా ఉండే ఆహారాలను పుష్కలంగా తినాలి. 

28

ఇనుము లోపం సంకేతాలు, లక్షణాలు

1. శ్వాస సమస్యలు

2. తీవ్రమైన తలనొప్పి

3. గుండె దడ 

4. నోట్లో పుండ్లు, నోటి వాపు

5. కాళ్ళలో చంచలత 

6. వేళి గోర్లు పెళుసులుగా మారడం, 

7. వింత కోరికలు

8. డిప్రెషన్

9. ఆకలి లేకపోవడం
 

38

మహిళల్లోనే ఇనుము లోపం ఎక్కువ

పీరియడ్స్:  నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం.. భారతీయ మహిళల్లో దాదాపు 50 శాతం మంది ఇనుము లోపంతో బాధపడుతున్నారట. ఐరన్ ను తక్కువగా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఆక్సిజన్ స్థాయిలో సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల నెలసరి ఎక్కువ రోజులు అవుతుంది. ఇది రక్త నష్టానికి దారితీస్తుంది.
 

48

ప్రెగ్నెన్సీ: ఇనుము లోపం మరీ ఎక్కువగా ఉంటే గర్భిణులకు ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది పిల్లలు టైం కంటే ముందుగానే పుట్టే ప్రమాదం ఉంది.  గర్భధారణ సమయంలో మహిళల్లో ఇనుము లోపిస్తే.. పిల్లలు తక్కువ బరువు ఉంటారు. అలాగే ప్రసవానంతర నిరాశకు దారితీస్తుంది.

58

ఇనుము లోపాన్ని నివారించడానికి ఏం తినాలి?

ఇనుము లోపం ఉందో? లేదో తెలుసుకోకుండే.. గుండె  జబ్బులు,  గర్భధారణ సమయంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. పేలవమైన ఆహారం, భారీగారక్త నష్టం, గర్భం, ఇనుమును గ్రహించే శరీరం సామర్థ్యం తగ్గడం వంటి సాధారణ కారణాల వల్ల శరీరంలో ఇనుము లోపిస్తుంది. 
 

68

ఈ సమస్యలను నివారించడానికి.. ఇనుము పుష్కలంగా ఉండే ఆహారానలు పుష్కలంగా తీసుకోవాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఇనుము లోపం తలెత్తే ప్రమాదాన్ని తగ్గించొచ్చు. మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్ లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. మొక్కల ఆధారిత ఆహారాల్లో కూడా  ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉండే కొన్ని ఆహారాలు..
 

78

iron

రెడ్ మీట్,  పంది మాంసం, పౌల్ట్రీ

సీఫుడ్

గుడ్లు

బీన్స్

బచ్చలికూర వంటి ముదురు ఆకుకూరలు

ఎండుద్రాక్ష, నేరేడు పండ్లు వంటి డ్రై ఫ్రూట్స్

బలవర్థకమైన తృణధాన్యాలు, రొట్టెలు,  పాస్తాలు

బఠానీలు

మన శరీరం మాంసం నుంచి ఇనుమును ఎక్కువగా గ్రహిస్తుంది. అయితే శాఖాహారులు, మాంసం తినకూడదు అనుకునే వాళ్లు మాంసం తినే వ్యక్తి మాదిరిగానే ఖనిజాన్ని పొందడానికి ఇనుము అధికంగా ఉండే మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

88

విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా శరీరం ఇనుము శోషణను పెంచుతుంది. ఇవి మనం తిన్న ఆహారం నుంచి ఇనుమును గ్రహించడానికి సహాయపడతుంది. ఇందుకోసం బ్రోకలీ, టమోటాలు, కివీలు, నారింజ, స్ట్రాబెర్రీలు, మిరియాలు వంటి పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినండి. 

ఇవే కాకుండా ఐరన్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. అయితే ఐరన్ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకుంటే.. కడుపు నొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని అతిగా తీసుకోకండి. 

Read more Photos on
click me!

Recommended Stories