1.తమ దాంపత్య బంధం అందంగా, బలంగా ఉండాలని కోరుకుంటే సరిపోదు.. దానికి తగిన కృషి కూడా చేయాలి. మీ మధ్య దూరం పెరుగుతోంది అనే భావన కలిగినప్పుడు.. ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవాలి. మీరు ప్రేమ బంధంలోకి అడుగుపెట్టినప్పుడు, పెళ్లైన కొత్తలో మీరు ఎలా ఉండేవారు..? మీ మధ్య జరిగిన మధుర గ్నాపకాలను గుర్తుచేసుకొని మాట్లాడుకోవాలి.