ఈ దీపావళికి మీరు అందంగా కనిపించాలా? అయితే వీటిని మిస్ కాకుండా తినండి..

First Published Oct 21, 2022, 3:00 PM IST

ఒక్క ఆరోగ్యానికే కాదు.. చర్మ సంరక్షణలో కూడా ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. పోషకాహార నిపుణురాలు నవమి అగర్వాల్ పండగ సీజన్ లో అందంగా కనిపిండానికి ఎలాంటి ఆహారాలు ఉపయోగపడతాయో ఇన్ స్టా వేదికగా తెలియజేశారు. అవేంటంటే.. 
 

చర్మం ఆరోగ్యంగా ఉంటేనే.. అందంగా కనిపిస్తారు. అయినా నలుగురిలో తామే అందంగా, కాంతివంతంగా కనిపించాలని కోరుకోని వారు అసలే ఉండరేమో. మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచడానికి మీరు పెద్దగా కష్టపడిపోవక్కర్లే.. జస్ట్ కొన్ని కొన్ని ఆహారాలను తింటే చాలు. చర్మంతో పాటుగా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

Image: Getty Images

పోషకాహార నిపుణురాలు నవమి అగర్వాల్ ఇన్ స్టా గ్రామ్ వేధికగా మాట్లాడుతూ.. కొన్ని రకాల ఆహారాలను తింటే.. చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాదు.. అందంగా కూడా మెరిసిపోతుంది.  ఇవి మీ శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని చెప్పింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కుంకుమ పువ్వు

కుంకుమపువ్వులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని సహజంగా గర్భిణులు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే దీన్ని పాలలో వేసుకుని తాగితే బిడ్డ తెల్లగా బుర్రగా పుడతాడని. నిజానికి కలర్ వస్తది అనేది ఉత్తి భ్రమేనంనటున్నారు నిపుణులు. నిజమేంటంటే కుంకుమ పువ్వులో ఉండే ఔషదగుణాలు తల్లితో పాటుగా బిడ్డను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని ఒక్క గర్భిణులే కాదు ఇతరులను కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇవి మీ చర్మానికి సహజ మెరుపును ఇవ్వడంలో సహాయపడతాయి. కుంకుమపువ్వును నీటిలో నానబెబ్టి తాగడం చర్మానికి మంచిదని న్యూట్రిషనిస్ట్ నవమి అగర్వాల్ చెప్పారు. ఇందుకోసం రాత్రి గ్లాస్ నీళ్లలో కుంకుమ పువ్వును వేయండి. దీన్ని ఉదయం తాగండి. అయితే ఈ కుంకుమ పువ్వును ఎక్కువగా తినడం మంచిది కాదు. 
 

ఉసిరి

ఉసిరిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి తో పాటుగా ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉసిరికాయ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉసిరి రసం తరచుగా తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా అందం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. 
 

nuts

గింజలు

గింజల ద్వారా మన  శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. వీటిలో పుష్కలంగా ఉండే  విటమిన్ బి, విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్ ను డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి వృద్ధాప్య లక్షణాలు లేట్ గా వచ్చేలా చేస్తాయి. ముడతలను తగ్గిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. 
 

సిట్రస్ పండ్లు

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రిస్ పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండ్లు వడదెబ్బ వల్ల కలిగే చర్మ సమస్యలను తగ్గిస్తాయి.  చర్మాన్ని సహజసిద్ధంగా హైడ్రేట్ చేస్తాయి. చర్మం పొడిబారడం, నల్లటి మచ్చలను దూరం చేస్తాయి. ఈ సిట్రస్ పండ్లు స్కిన్ టోన్ ను మెరుగుపరచడానికి సహాయపడతాయి కూడా. 
 

click me!