తీవ్ర ఆరోగ్య సమస్యలు: టీ, సిగరెట్ కలిపి తాగడం చాలామంది పొగరాయుళ్లకు అలవాటు. కాస్త రిలీఫ్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇలా చేస్తుంటాం అంటారు. కానీ ఆ ఫలితాలు ఉండవు సరికదా.. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ఇది వెంటనే ఆపేయకపోతే తీవ్ర ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
టీ కొట్టులో చాలా మంది టీతో పాటు సిగరెట్ తాగుతూ కనిపిస్తారు. టీ, సిగరెట్ కలిపి తాగితే ఉత్సాహంగా ఉంటుందని వారు భావిస్తారు. టీ, సిగరెట్ రెండూ కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం. చాలా మంది ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి టీ, సిగరెట్ కలిపి తీసుకుంటారు. కానీ వాస్తవం వేరు. అవి తాగడం మాట అలా ఉంచితే చెడే ఎక్కువ జరుగుతుంది.
24
క్యాన్సర్ కారకం
2023లో అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రచురించిన నివేదిక ప్రకారం, వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక కణాలు దెబ్బతింటాయి. దీనితో పాటు సిగరెట్ తాగితే ప్రమాదం రెట్టింపు అవుతుంది. కాలక్రమేణా, ఇది క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
34
టీ, సిగరెట్ కలిపి తాగడం వల్ల కలిగే నష్టాలు
- గుండె, మెదడు సంబంధిత వ్యాధులు
- కడుపులో పుండ్లు
- ఊపిరితిత్తుల సమస్యలు
- జ్ఞాపకశక్తి కోల్పోవడం
- చేతులు, కాళ్ళలో పుండ్లు
- సంతానలేమి సమస్యలు
- రక్తహీనత
- మలబద్ధకం, ఇతర కడుపు సమస్యలు
- అలెర్జీలు
44
ఇలా బయటపడాలి
టీ, సిగరెట్ కలిపి తాగడం మానేయడం ఎలా?
- మానసికంగా దృఢంగా ఉండండి.
- టీ తాగడం తగ్గించండి. హెర్బల్ టీలు ప్రయత్నించండి.