చిరుధ్యాన్యాలు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచివి.. ఇవి ఎన్ని రోగాలను తగ్గిస్తాయో తెలుసా?

First Published Feb 5, 2023, 2:44 PM IST

అన్నంలో కార్భోహైడ్రేట్లు తప్పా మిగతా పోషకాలు పెద్దగా ఉండవు. వీటివల్ల ప్రయోజనాలు చాలా తక్కువ. కానీ చిరుధాన్యాలు అలా కాదు.. వీటిని తినడం వల్ల ఒకటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 

millets

చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి చేసే మేలు అతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ చిరుధాన్యాలను ఆఫ్రికా, ఈజిప్టు, ఐరోపాలోని ఇతర ప్రాంతాలలో శతాబ్దాలుగా పండిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు ఎన్నో ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. భారతదేశంలో చిరుధాన్యాలను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నప్పటికీ.. వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అసలు చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తాయి

చిరుధాన్యాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఏదైనా ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే అది తొందరగా జీర్ణమై శరీరంలో శోషించబడుతుంది. దీని ఫలితంగా మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ చిరుధాన్యాలు అలా కాదు. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
 


ఆస్తమాను నివారిస్తుంది

గోధుమలు అలెర్జీని కలిగిస్తుంటాయి కూడా. కానీ చిరుధాన్యాలు ఉబ్బసం రోగులకు మంచి ప్రయోజనకరంగ ఉంటాయి. మిల్లెట్ ఉబ్బసం ప్రభావాలను గణనీయంగా తగ్గిస్తుందని, దానిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.
 


అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది

ఫైబర్ కంటెంట్ మన శరీరానికి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలను తగ్గిస్తుంది.  ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి, ధమనులు మూసుకుపోకుండా ఉండటానికి ఎంతో సహాయపడుతుంది.  చిరుధాన్యాలలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
 

millets for weight loss


బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది

చిరుధాన్యాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. మీరు ఫిట్ గా ఉండాలని ప్రయత్నం చేస్తుంటే మీ రోజు వారి ఆహారంలో చిరుధాన్యాలను చేర్చండి. ఇవి  మిమ్మల్ని శక్తివంతం చేయడమే కాకుండా.. మీ ఆకలిని దూరం చేస్తాయి. చిరుధాన్యాలు తినడం వల్ల మీరు ఫుడ్ ను అతిగా తినలేరు. ఎందుకంటే అవి మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి.
 

రోగనిరోధక శక్తిని పెంచుతాయి

చిరుధాన్యాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే అంటు వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. వీటిలో జింక్, భాస్వరం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఆరోగ్య ఖనిజాలు  ఉంటాయి. చిరుధాన్యాలు మీ శరీరానికి వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో ఫినోలిక్ సమ్మేళనాలు వంటి యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల మీ కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించబడతాయి. చిరుధాన్యాలలో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడే ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. 

click me!