తలనొప్పే కదా అని లైట్ తీసుకోకండి.. ఇది ఎన్నో రోగాలకు సంకేతం కావొచ్చు..

First Published Feb 5, 2023, 1:48 PM IST

తీరిక లేని పనులతో తలనొప్పి రావడం సర్వసాధారణ విషయం. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో దీన్ని తగ్గించుకోవచ్చు. కానీ చాలా సార్లు ఈ తలనొప్పి కొన్ని రోగాల కారణంగా వస్తుంది. అందుకే తలనొప్పిని చిన్న సమస్యగా భావించకూడదంటున్నారు నిపుణులు. 

headache

రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, పని చేయడం తలనొప్పికి ప్రధాన కారణాలు. చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావిస్తారు. సాధారణంగా చిన్న తలనొప్పి కూడా పెద్ద సమస్యకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. తలలో తలెత్తే నొప్పి క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధికి కూడా కారణం కావొచ్చు. అసలు తలనొప్పి ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

తలనొప్పికి కారణమయ్యే కొన్ని కారణాలు

మాయో క్లినిక్ ప్రకారం.. ఆల్కహాల్, ముఖ్యంగా రెడ్ వైన్ తలనొప్పికి కారణమవుతుంది.

ప్రాసెస్ చేసిన మాంసాలు కూడా తలనొప్పికి కారణమవుతాయి. నిజానికి ఇందులో నైట్రేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

నిద్రలో మార్పులు లేదా నిద్రలేమి వల్ల కూడా తలనొప్పి ఎక్కువ అవుతుంది. 

రాత్రిపూట సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుంది.

మాయో క్లినిక్ ప్రకారం.. కొంతమంది బరువు తగ్గడానికి మైళ్ల దూరం నడుస్తారు. ఇది కూడా తలనొప్పిని కలిగిస్తుంది. 

ఒత్తిడి, ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే కూడా తలనొప్పి వస్తుంది. 
 

గ్యాస్

సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. జంక్ ఫుడ్ మన శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇదే ఎసిడిటీకి దీనికి ప్రధాన కారణం. ఇది తలనొప్పి, కొన్నిసార్లు వెన్నునొప్పికి కారణమవుతుంది.
 

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకూడదు

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల కూడా మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేయడమే కాకుండా తలకు రక్తప్రసరణ సరిగ్గా జరగకుండా చేస్తుంది. తలలోని సిరలకు చేరడానికి రక్తం లేకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. అంతేకాకుండా ధూమపానం కూడా శరీరాన్ని దెబ్బతీస్తుంది. స్మోకింగ్ ఎక్కువగా చేయడం శరీరానికి హానికరం.
 

నీటిని ఎక్కువగా తాగాలి

శరీరంలో నీరు లేకపోవడం కూడా తలనొప్పి వస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో తేలికపాటి గోరువెచ్చని నీటిని  కొంచెం కొంచెం తాగాలి. దీనివల్ల శరీరంలో నీటి మట్టం నార్మల్ గా మారుతుంది. ఆ తర్వాత క్రమంగా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 

Image: Getty Images

లవంగాల వాసన

లవంగాలను కొద్దిగా వేయించి తర్వాత ఒక గుడ్డలో కట్టండి. కాసేపు దీని వాసన చూడండి. నెమ్మదిగా తలనొప్పి తగ్గుతుంది. 
 

ఇతర చిట్కాలు

పుదీనా ఆకులు, నల్ల మిరియాలు నీటిలో వేసి కాసేపు మరిగించి ఆ తర్వాత కషాయంలా తాగండి. ఇది నొప్పిని తగ్గిస్తుంది.
వీటితో పాటు వైద్య పరీక్షలు కూడా చాలా ముఖ్యం. తలనొప్పి నుంచి ఉపశమనం లభించకపోతే.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
తీవ్రమైన అనారోగ్యానికి గురైతే, తలనొప్పిని తేలికగా తీసుకోవడం మంచిది కాదు. 

click me!