జొన్నల్లో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

First Published Dec 23, 2022, 1:59 PM IST

జొన్నల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. జొన్నలతో రొట్టెలు, ఇతర ఆహారాలను చేసుకుని తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. 
 

ధాన్యాలను దశాబ్దాల కాలం నుంచి ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ఇవి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. కానీ ప్రస్తుత కాలంలో వీటి వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఏమైనా ప్రాసెస్ చేసిన ఆహారాలనే వాడుతున్నారు. కానీ ప్రాసెస్ చేసిన ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడంవల్ల  ఊబకాయం, మంట వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి తృణధాన్యాలు తినడం వల్ల డయాబెటిస్, గుండె సమస్యలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

భారతీయ ఆహారాల్లో జొన్నలను ఉపయోగించడం సర్వసాధారణం. జొన్నల్లో ప్రోటీన్, విటమిన్, ఖనిజాలు వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న గ్లూటెన్ లేని లక్షణాలకు ప్రసిద్ధి. దీని పిండితో రొట్టె, కేక్, కుకీలు, మాల్ట్ వంటి రకాల వంటలను తయారుచేసుకుని తింటుంటారు. అసలు జొన్నలు మనకు ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జొన్నల్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీర పెరుగుదలను ప్రేరేపిస్తాయి. చిరుధాన్యాలలో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం కూడా పుష్కలంగా ఉంటాయి. జొన్నలు ఎముకలను బలంగా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడతాయి. జొన్నలో థియామిన్, నియాసిన్, ఫోలేట్, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 

 క్యాన్సర్ నివారణ

జొన్నల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి మనకు  శక్తినిస్తాయి. ఈ జొన్నలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు తగ్గడానికి

జొన్నలు బరువు తగ్గేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. ఇది ఆకలిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకుంటే గోధుమ పిండి చపాతీలకు బదులుగా జొన్న పిండి రొట్టెలను తినండి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంటాయి

షుగర్ పేషెంట్లకు జొన్నరొట్టెలు ఔషదంతో సమానం. ఎందుకంటే ఇది జొన్నపిండిలో గోధుమ పిండి కంటే తక్కువ గ్లైకోజెన్ సూచిక ఉంటుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ను విడుదల చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది.
 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది 

జొన్నలో కాల్షియం, మెగ్నీషియం, రాగి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీనిలోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచుంది. కణజాలాల పెరుగుదలకు ఇవి సహాయపడతాయి. దీనిలో ఉండే ఇనుము ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇవన్నీ మీ రోగనిరోధక శక్తిని బలంగా చేయడానికి సహాయపడతాయి.
 

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

జొన్న రొట్టెలను తింటే మీ గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా  ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. 
 

click me!