కలబంద రసం తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

First Published Dec 23, 2022, 12:54 PM IST

కలబంద రసంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీని తాగడం తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. 
 

అలోవెరాను అందం సంరక్షణ కోసం వివిధ రకాల ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటారు. కలబంద రసంలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ కలబంద రసాన్ని జుట్టుకు పెట్టుకోవడం వల్ల చుండ్రు తొలగిపోతుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు గ్రోత్ బాగుంటుంది. అలాగే అందంగా మెరిసిపోతుంది కూడా. దీన్ని ఫేస్ కు పెట్టుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చనిపోయిన కణాలు తొలగిపోతాయి. డెడ్ స్కిన్ సమస్య ఉండదు. అంతేకాదు ఇది చర్మాన్ని తేమగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఒక గ్లాసు కలబంద రసం తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాదు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. 

టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లు గ్లాస్ కలబంద రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కలబంద రసంలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఇవి మలబద్దకం నుంచి ఉపశమం పొందడానికి సహాయపడతాయి. అయితే ఈ విషయంలో మరిన్ని అధ్యయనాలు అవసరమంటున్నారు నిపుణులు. 
 

గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జిఇఆర్డి) లక్షణాలకు చికిత్స చేయడానికి, తగ్గించడానికి కలబంద సిరప్ సహాయపడుతుందని కొన్ని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (ఐబిఎస్) చికిత్సకు కలబంద సారాన్నిఉపయోగించడం వల్ల మంచి ఫలితాలొస్తాయంటున్నాయి పలు పరిశోధనలు. 
 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది. ఈ చెడు కొలెస్ట్రాల్ కు దూరంగా ఉండటానికి, మంచి కొలెస్ట్రాల్ ను నిర్వహించడానికి కలబంద రసం ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కలబంద రసం శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. కలబంద నోటి ఆరోగ్యానికి, దంత సంరక్షణకు కూడా మంచిది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిని శుభ్రంగా ఉంచుతాయి.

aloe vera

కలబంద జ్యూస్ ను ఎలా తయారు చేయాలి

మొదట తాజా కలబంద కాండాన్ని కత్తిరించండి. దీన్ని కత్తి లేదా చెంచాతో తొక్క తీసి లోపల జెల్ ను తీయండి. కలబంద స్కిన్ చేదుగా ఉంటుంది. అందుకే దాన్ని పక్కన పెట్టండి. ఈ జెల్ కు రెండు ముక్కలు అల్లం, అర టీస్పూన్ నిమ్మరసం, కొంత నీరు వేసి మిక్సీలో వేయండి. ఆ తర్వాత దీనిలో కొంచెం తేనే లేదా చక్కెరను వేసి తాగండి. 

click me!