క్రిస్మస్ సందర్భంగా.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇలా చేయండి

Published : Dec 23, 2022, 12:03 PM IST

క్రిస్మస్ సందర్భంగా చాక్లెట్లు, తియ్య తియ్యని కేకులు నోరూరిస్తాయి. ఇంకేముంది మన హెల్త్ ఎలా ఉందో తెలుసుకోకుండా లాగించేస్తుంటాం. కానీ డయాబెటీస్ పేషెంట్లు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి.   

PREV
18
 క్రిస్మస్ సందర్భంగా.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇలా చేయండి

ఈ మధ్యకాలంలో డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతుంది. శారీరక శ్రమ చేయకపోవడం, జీవన శైలి సరిగ్గా లేకపోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాన్ని తినడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. డయాబెటీస్ పేషెంట్లు ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవి పడితే అవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ముందే 25వ తేదీనా క్రిస్మస్ పండుగ ఉంది. ఈ సందర్భంగా చాక్లెట్లు, స్వీట్లు, కేకులు, రుచికరమైన విందులు నోరూరిస్తాయి. షుగర్ పేషెంట్లు కూడా వీటిని తింటుంటారు. ముఖ్యంగా చక్కెరతో చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. మధుమేహులు ఆహార కోరికలను నియంత్రించుకోలేరు. కానీ వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో శరీర ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు, మెరుగైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. అవేంటంటే.. 

28

ఆరోగ్యకరమైన పానీయాలు

పండుగ కదా అని సోడాలు, కోలాలు, శీతల పానీయాలను తెగ తాగేయకండి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కొబ్బరి నీరు, తక్కువ కొవ్వు ఉండే లస్సీ లేదా బెర్రీలు, ఆపిల్, నారింజతో చేసిన స్మూతీలను తీసుకోండి. హైడ్రేటెడ్ గా ఉండటానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి నీళ్లను పుష్కలంగా తాగండి. 
 

38
diabetes

శారీరక శ్రమ

శారీరక శ్రమ లేకుంటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అందుకే శారీరక శ్రమ చేయండి. ఇందుకోసం మెట్లను ఎక్కండి. చిన్న చిన్న పనులకు కూడా బైక్ లను వాడకండి. నడక ఉత్తమం. అలాగే వీక్లీ ఒకసారైనా సైక్లింగ్ చేయండి. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు తప్పకుండా నడవండి. 
 

48
diabetes

ప్లానింగ్

రోజుకు మూడు సార్లు హెవీగా తినడానికి బదులుగా.. కొంచెం కొంచెం రోజుకు నాలుగైదు సార్లైనా తినండి. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. పోషకాహారం రక్తంలో చక్కెర స్థాయిలు మరింత స్థిరంగా ఉంచుతుంది. 

58
doctor live diabetes

మందులు

ఏ పండుగున్నా డాక్టర్ సూచించిన విధంగా ప్రిస్క్రిప్షన్ మందులను తప్పకుండా వేసుకోండి. డయాబెటీస్ పేషెంట్లు మందులను స్కిప్ చేయడం అంత మంచిది కాదు. మీ రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయడానికి గ్లూకోమీటర్ ను తప్పకుండా ఉపయోగించండి.
 

68
diabetes

సమతుల్య ఆహారం

చక్లి, చివ్డా, శెనగపిండి లడ్డులు లేదా ఇతర స్వీట్లను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. వీటిని తినడానికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. 

78
diabetes

ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకండి

ఆల్కహాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతాయి. అందుకే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకండి. రెగ్యులర్ గా తాగే అలవాటుంటే ఒక గ్లాస్ కు మించి తాగకండి. శీతల పానీయాలకు బదులుగా లెమన్ వాటర్, కొబ్బరి నీళ్లు వంటి హెల్తీ పానీయాలను తాగండి. 

88

క్వాంటిటీ కంటే నాణ్యత ముఖ్యం

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల డయాబెటీస్ పేషెంట్లకు అతిగా ఆకలి వేస్తుంది.  ముఖ్యంగా స్వీట్ ఐటెమ్స్ ను తినాలన్న కోరిక పుడుతుంది. ఇలాంటప్పుడు షుగర్ పేషెంట్లు చక్కెర తక్కువగా ఉన్న లేదా అస్సలు లేని ఖీర్, రబ్దీ వంటి ఇంట్లో తయారుచేసిన స్వీట్లను తినండి. 

Read more Photos on
click me!

Recommended Stories