చాలా మంది వర్షాకాలంలో జామకాయను తినరు. తింటే జలుబు (cold)చేస్తుందని భావిస్తారు. కానీ వర్షాకాలంలో కూడా జామకాయలను కూడా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో వైరల్ ఫీవర్, బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యల బారిన పడకూడదంటే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. అప్పుడే విరేచనాలు, వాంతులు, జ్వరం, జలుబు రావు. అలాగే గొంతునొప్పి, దగ్గు, డయేరియా వంటి సీజనల్ సమస్యల బెడద కూడా తప్పుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.